పుట:RangastalaSastramu.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. సూతుడు పౌరాణిక, ఇతిహాసిక కధలు భారతీవృత్తి
   చెప్పడం. (వాచకము)
2. సూతుడు ఇతర గాయకులతో కలసి సాత్త్వీతీవృత్తి
    కధచెప్పడం (కుశలవుల రామాయణ (సాత్త్వీకము)
    గానము)
3. సూతుడు ఆహార్యంతో నటితో కలసి కైశికీవృత్తి
   సంభాషణా పూర్వకంగా కధచెప్పడం (ఆహర్యము)
4. పౌరాణిక ఇతివృత్తాలు గానవృత్తా అరభటీవృత్తి
   లతో కూడిన రంగాలుగా విభజింప (అంగీకాభినయము)
   బడడం.

ఇట్లా రూపకానికి అవసరమైన చతుర్విభినయాలు సూత-సూత్రధారపరిణామంలోని నాలుగు దశలకు అనుగుణము కావడంవల్ల పురాణాలనుంచే రూపకము ఆవిర్భవించిందని శ్రీ జాగీర్ధార్ నిర్ధరించినారు.

మౌల్టన్ సిద్ధాంతము

తొలి మానవుడు అనాగరిక దశలో కష్టసుఖాలను నేటి నాగరికులవలె తనలో అణచుకోకుండా ఉధృతక్రియారూపంలో బహిర్గతము చేసేవాడు. ఆనందాతిశయంలో వేసిన గంగులనుంచే నృత్య మావిర్భవించింది. వారి ఆలాపము సంగీతానికి తొలిచూపు. కష్టసుఖాలలో వారి నోటివెంట వెలువడిన వాక్కులు సముదాయమే కవిత్వానికి మూలము. చిన్నపిల్లలు కోరిన వస్తువు లభించినపుడు ఆనందంతో తీసే కూనిరాగాలలో, జిలిబిలి పలుకులలో, చిందులలో సంగీత కవిత్వ వృత్యాలు బీజరూపంలో గోచరిస్తాయి. ప్రపంచంలో తొలిగా రచింపబడిన రూపకాలు సంగీత కవిత్వ నృత్య సమ్మిళితాలు కవడంవల్ల తొలి మానవుల ఆలాపాల, వాక్యాల, చిందులనుంచే రూపకాలు ఆవిర్భవించినవని ప్రొఫెసత్ మౌల్టన్ (Moulton) సిద్దాంతీకరించినాడు. ఆదిగ్రంధమైన ఋగ్వేదంలో నాటి మానవుల కష్టసుఖాలనుంచి వెలువడిన సంగీత, కవిత్వ నృత్యాలు చిత్రితమవడం ఇక్కడ గమనించతగ్గది.