Jump to content

పుట:RangastalaSastramu.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జాగీర్ దార్ సిద్ధాంతము

ఉవాచ, భీష్మ, ఉవాచ, భీమ ఉవాచ, అర్జున ఉవాచ, ద్రౌపది ఉవాచ" అని కొంతవరకు సాగిన తరవాత తిరిగి "సూత ఉవాచ" అని వస్తుంది. ఇందులోని భీష్మ, భీమార్జున, ద్రౌపదులు భారతల్కధలోని పాత్రలు. సూతుడు మాత్రము పాత్రకాదు. ఎవరు ఎవరితో చెప్పుతున్నారో, ఎందుకు చెప్పుచున్నారో సూచించి, సూతుడు రంగం నుంచి తప్పుకొంటున్నడు. ఆతరువాత భీష్మాదిపాత్రల మధ్య సంభాషణ సాగురుంది. ఈ సంభాషణ ముగిసిన తరవార, ఇంకొకపాత్ర మాటాడేముందు సూతుడు తిరిగి ప్రవేశించి ఆ కొత్త పాత్రను పరిచయము చేసి, ఫలానా పాత్ర మాట్లాడబొతున్నదని చెప్పి, తిరిగి తాను తప్పుకొంటున్నాడు. ఇట్లా సూతుడు ఫలానాపాత్ర మాటాడబోతున్నదని చెప్పి తాను తప్పుకోవడం పురాణంలో ఆద్య0తమూ సాగుతుంది.

ఈపురాణప్రక్రియమందే రూపకమావిర్భవించినదని జాగీర్ దార్ సిద్ధాంతం. పురాణాలోని సూతుడు నాటకసూత్రధారిగా మారినాడు. పురాణాలలోవలె సూత్రధారుడు మధ్య మధ్య ప్రవేశించకుండా నాటకప్ర్రారంభంలో ప్రస్తావనను, నాటకాంతంలో భరతవాక్యాన్ని పలుకుతున్నాడు. సూతుని పాత్రపరిచయాదులను ప్రవేశానిష్క్రమణసూచనలను, పూర్వాపరకధాసంధానాన్నిల్ నాటకంలోప్రస్తావన, విష్కంభాలు నెరవుతున్నవి.

బ్రహ్మ నాట్యశాస్త్రాన్ని సృష్టించి ఇంద్రునితో "నాట్యాఖ్యం పంచమం వేదంసేతిహాసం కరోమ్యహమ్" అని రాను నాట్యాన్ని ఇరిహాస సహితంగా సృష్టించినట్లు చెప్పడం, సంసృత రూపకకధలు ఇతిహాసపురాణాలనుంచి గ్రహించినచి కావడం ఈ సందర్భంలో గమనార్హం.

సర్వకాయాలకు వృత్తులు మాతృకలని భరతముని సిద్దాంతము. ఈ వృత్తులు నాలుగు- 1. భారతీవృత్తి, 2.సాత్త్వతీవృత్తి, 3.ఆరకభటీవృత్తి 4.కైశికీవృత్తి, వృత్తిఅంటే వ్యాపారము. వాగ్రూపవ్యాపారము భారతీవృత్తి; అంటే వాచికాభినయము. మనోవ్యాపారము పాత్త్వత్గీవృత్తి: అంటే సాత్త్వకాభినయము. చేష్టావ్యాపారము ఆరభటీవృత్తి: అంటే ఆంగికాభినయము. ఈ వృత్తులలోని శోభ అంతా కైశికీవృత్తి.

సూతుడు సూత్రధారుడుగా పరిణమించడంలో నాలుగు వృత్తుల కనుగుణమైన నాలుగు దశలు కానవస్తున్నాయి.