Jump to content

పుట:RangastalaSastramu.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆజ్ఞచే బ్రహ్మ లోకాలన్నింటినీ సృజించి, ఆ మహాదేవ్లుని పురావృత్తమును ప్రత్యక్షముగా దర్శింప గోరినాడు. అంత నందికేశ్వరుడు బ్రహ్మకు నాట్యవేదాన్ని నప్రయోగంగా బోధించి, దాని ప్రకారము ఒక రూపకము నిర్మించి నటులకు నేర్పితే వారి రూపకప్రయోగంవల్లప్రాక్తనకర్మలు ప్రత్యక్షమవుతాయని చెప్పినాడు. బ్రహ్మ నాట్యవేదము లభించినందుకు ఆనందించి "త్రిపురదాహ" మనే రూపకము రచించి, ప్రయోగింప జేసినాడు. దానిని వీక్షిస్తున్న బ్రహ్మ నాలుగు ముఖాలనుంచి నాలుగు వృత్తులు, శృంగారాది ప్రధానపాలు నాలుగు ఆవిర్భవించినవి.

ఆ తరువాత నహుడు ఇంద్పదవి నలంకరించినప్పుడు ఆయన కొరిక మీద భరతపుత్రులు భూలోకము చేరుకొని ఇక్కడి వారికి ప్రయోగవిధానాన్ని నేర్పి రూపకదర్శనాన్ని ప్రతిష్టితము చేసినారు.

పురాణ కాలక్షేప్;అ సిద్ధాంతము

భారతదేశంలో ప్రతిగ్రామంలో ప్రతి పట్టణంలో సామాన్యంగా రాత్రులందు పురాణకాలక్షేపము జారగడం పరిపాటి. వర్షాలు పడకపోతే సుందర కాండగాని విరాటపర్వంగాని పురాణము చెప్పించడం ఆచారము. ఈపురాణకాలక్షేపంలో ఒకరు పురాణగ్రంధం నుంచి ఓకటి రెండు శ్లోకాలో, పద్యాలో చదివి అవగానే ఆ శ్లోకాలలోని లేదా ఆపద్యాలలోని అర్ధాన్ని ప్రేక్షకులకు పౌరాణికుడు విపులీకరించి చెప్పుతూఉంటాడు. అయితే పద్యాన్ని పాడి మాటలతో చెప్పడం గాక ఆ పద్యార్ధానికి అనుగుణమైన హావ, భావ, చేష్టలతో, ఉచ్చారణతో విశదీకరిస్తూ ఒక రసప్రపంచాన్ని సృస్ఠించి ప్రేక్షకులను అందులో ముంచెత్తుతాడు. కధా సందర్బాన్ని బట్టి పాత్రలు ఆనందిస్తూంటే ప్రేక్షకులూ ఆనందిస్తారు. పాత్రలు కష్టాల పాల్వొతూంటే ప్రేక్షకులు కన్నెరు పెట్టు;కొని చింతిస్తారు, ఏదుస్తారు.

ఈకాలక్షెపప్రక్రియలో పౌరాణికుడు కధలోని పాత్రల నన్నింటిని తానొక్కడే అభినయిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు-ఏడిపిస్తున్నాడు. దాని నుంచే ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క వ్యక్తి నటించడం ప్ర్రారంభమై రూపక మావిర్భవించిందని కొందరు పండితుల ఊహ.

జాగీర్ దార్ సిద్ధాంతము

పురానణాలు సూతుని కధాకధనంగా రూపొందినవి. వాటిలో "సూత