Jump to content

పుట:RangastalaSastramu.djvu/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భరతముని సిద్ధాంతము

వీటన్నింటిని బట్టి రూపకము బీజరూపము వేదాలలో విలసిల్లిందని పండితుల అభిప్రాయము.

భరతముని సిద్ధాంతము

పూర్వము కృత-త్రేతాయుగ సంధికాలంలో సర్వజనులు కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యల్లోలురై అధర్మపరులు కాగా ధర్మప్రతిష్టాపన నోద్దేశంతో ఇంద్రాది దేవతలు దృశ్యమును, శ్రవ్యమును చరుర్వర్ణములవారు పాల్గొనదగినది అయిన క్రీడావిశేషము నొకదానిని ప్రసాదింపుమని బ్రహ్మను కోరినారు. అంతఘ బ్రహ్మ ఋగ్వేదమునుంచి పాఠ్యమును, సామవేదంనుంచి గానమును, యజుర్వేదంనుంచి అభినయమును, అధర్వణ వేదంనుంచి రసమును గ్రహించి నాట్యవేదమును సృస్టించినాడు. అట్లా సృస్టించిన నాట్యవేదాన్ని బ్రహ్మ భరతమునికి ఉపచేశించి ప్రయోక్తవు కమ్మని ఆశీర్వదించినాడు. భతరుడు ఈ నాట్యశాస్త్రాన్ని తన నూరుగురు కుమారులకు బోధించినాడు. స్త్రీ పాత్రధారణకు బ్రహ్మ మజుకేశ మొదలైన 24 మంది అప్సరసలను సృస్టించి ఇచ్చినాడు. వీరందరితో భరతుడు ఇంద్రధ్వజ మహోత్స్సవ సమయంలో "అసురపరాజయ" మనే రూపకము ప్రదర్శించినాడు. ఇది బ్రహ్మ రచన. ఆ రూపకము తికిస్తున్న రాక్షసులు కోపోద్రిక్తులై ప్రదర్శనాన్ని భగ్నముచేయ తలపెట్టగా, ఇంద్రుడు తన ధ్వజంతో వారిని మర్ధించి, ప్రదర్శనము భంగము కాకుండా కాపాడినాడు. భరతముని ఇట్టి సంఘటనలు ముందు ఇమ జరకుండా విశ్వకర్మచేత నాటకశాలలను నిర్మింపజేసినాడు. ఆ పిమ్మట భరతముని శివుని ఎదుట సముద్ర మధనము, త్రిపురదాహము అనే రెండు రూపకాలు ప్రదర్శించినాడు. శివుడు సంతోషించి తాండవముని వారికి బోధించినాడు. పార్వతి లలితమగు లాస్యమును బోధించినది. పిమ్మట నహుషుని ఆహ్వానం మీద భరతముని పుత్రులు భూలోకానికి వచ్చి ఇక్కడివారికి ప్రదర్శనావిధానము నేర్పినాడు. ఈవిధంగా రూపకమావిర్బవించి, వ్యాప్తి చెందినదని భరతముని సిద్దాంతము. బ్రహ్మ సృష్టికర్త. నాట్యశాస్త్రాన్ని సృష్టికర్తే సృష్తించినాడనడంలో సృష్టిలోనుంచే నాట్య మావిర్భవించిందనే సూచన ఉన్నదేమో!

శారదాతనయని సిద్ధాంతము

సల్పాంతమందు శివుడు సర్వలోకాలను భష్మీపటలముచేసి, ఆనంద తాండవమాడి మనస్సంకల్పములతో బ్రహ్మను, విష్ణువును సృజించినాడు. శివుని