Jump to content

పుట:RangastalaSastramu.djvu/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాతతీయ సిద్ధాంతాలు

వేద సంగాద సిద్ధాంతమ్

సంసృతభాషలోనేగాక ప్రమంతభాషలలోనే తొలిగ్రంధంగా పరిగణింపబడుతున్న ఋగ్వేదంలో 15 సంగాదసూక్తాలున్నవి. వీటిలో కొన్ని ఇద్దరి (యమయమీ సంగాదము), ఊర్వశీ-పురూరవ సంవారదు) మధ్య, మరి కొన్ని ముగ్గురి (ఇంద్రుడు, అదితి, వామదేవుడు, అగస్త్యుడు, లోపాముద్ర, వారి కుమారుడు) మధ్య జరిగిన సంవాద సూక్తాలు. ఈ సంవాదాలను అనుసరించే వచనబాగాలుకూడ పూర్వము ఉండేవనీ, తరవాత తరవార అవి లుప్తములై పోయినవనీ కొందరి ఊహ. యజ్ఞయాగాది క్రతువులలో ఋత్విక్కులు ఆ యా సంవాదాలను పురస్కరించుకొని, రెండుమూడు బృందాలుగా వీడిపోయి వాటిలోని ఒక్కొక్క పాత్ర పాఠ్యాని ఒక్కొక్క బృందము పఠించేవారని, ఋత్విక్కులు ఆ యా పాత్రల వేషాలుకూడ వేసుకొనేవారనీ ఈ సంవాదాలనుంచే క్రమంగా రూపక మావిర్బవించినదనీ కొందరు పండితులు అభిప్రాయపడు;తున్నారు.

సంవాదాలే గాక ఏకపాత్ర వాచికసూక్తాలుకూడా ఋగ్వేదంలో కానవస్తున్నవి. ఇంద్రుడు సోమపాన మత్తుడై తుళ్ళుతూ కూలుతూ సోమపాన ప్రాశస్త్యాన్ని పొగిడే సూక్తాలు కొన్ని ఉన్నవి. యోగానంతరము ఋత్విక్కు ఇంద్రవేషంలో వచ్చి ఈ సూక్తాన్ని పఠించేవాడట!

వర్షాపేక్షతో మండూకకరాళాలు దరించి మండూకసూక్తము పఠిస్తూ నృత్యము చేసేవారట.

వేదక్రతువులలో రాజకీయతను ద్యోతకముచేసే ప్రదర్శనా లున్నాయి. సోమరసవిక్రయగాధ ఇందులో ఒకటి. సోమరసవిక్రేతను ఖరీదు ఇవ్వకుండా రాళ్ళతో కొట్టడం ఇందులోని ఇతివృత్తము. ఇట్లాగే జూదరులకు సంబందించిన గాధ కూడ ఒకటి ఉన్నది.

యజుర్వేదంలోని వశుమేధవిభాగంలో నరబలిని వటించేవారని కొందరి భావన. యజ్ఞసమయంలో ఋత్విక్కులు ఇంద్రాదిదేవరల వేషాలు వేసుకొని పూజలందుకొనే వారట.

భారతీయరూపకాలలో ప్రాధాన్యమువహించే సంగీతనృత్యాలు సామవేదంనుంచి ఆవిర్భవించినవి.