పుట:RangastalaSastramu.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రీకు రూపకోత్పత్తి

గ్రహమే కారణమని భావించి జాతర్లు చేసేవారు. ఇట్లాతమకు కలిగిన కష్టసుఖాలు గ్రామదేవతల ఆగ్రహానుగ్రహాలకు ఆరోపించుకొని, ఆయాదేవతలను జాతర్ల ద్వారా ప్రసన్నము చేసుకొనే వారు. ఆ జాతర్లలో పామరజనము తాగి తందనాలాడే వారు. కొందరు భజనపరులు దేవతలను కీర్తనలతో స్తుతించేవారు ఆ దేవతల కహాత్మ్యాలను కధనరూపంలో వర్ణించి వినిపించేవారు. వారికి మరికొందరు వంతపాడే వారు. దెవతల మహత్తులను గూర్చి ప్రశ్నలు వెసేవారు. ఆ సమయంలో కధకుడు ప్రత్యేకమైన దుస్తులు ధరించడం కూడా కద్దు. క్రమంగా ఈ తంతు సంభాషణాబద్ధమైన రూపకంగా రూపొందిందని చరిత్రకారుల అభిప్రాయము. గ్రీకు నాటకోత్పత్తి ఈ అభిప్రాయానికి బలీయమైన్ దృష్టాంతంగా తీసుకోవచ్చు.

గ్రీకురూపకోత్పత్తి

ప్రాచీన గ్రీసుదేశంలో ప్రతిసంవత్సరము రెండు పర్యాయాలు డెమెటర్ (Demeter) లేదా డయోనినస్ (Dionysus) బాకస్ (Bacchus) దేవతను గూర్చి ఉత్సవాలను జరిపేవారు. ఈఉత్సవాలలో దేవాలయం ముండు ఎత్తైన వేదిక మీద 50 మందికి పైగా గాయకులు కూర్చుండి ఆయాదేవతలను సంకీర్తించేవారు స,గీతంతోపాటు ఆయూ దేవతల పుట్టుపూర్వోత్తరాలను మహిమలను అబివర్ణిస్తూల్ కధారూపంలో గానము చేసేవారు.

ఈ బృందగానానికి కీర్తనల రచయితే సూత్రధారుడుగా వ్యవహరించేవాడు. ధెస్ సిస్ (Thespis) అనే కళాకారుడు సూత్రధారుని గాయకుల నుంచి వేదుచేసి నటుని సృష్టించినాడు. గాయకులు విశ్రాంతి తీసుకొనే సమయంలో ప్రతిశీర్షము (Mask) ధరించిన నటుని ధెన్ సిస్ ప్రవేశ పెట్టినాడు. ఈ నటుడు హాస్యంతో ప్రేక్షకులను ఆనందింపజేసేవాౠ. తరవాత ఈ నటుడు హాస్యంతొ ప్రేక్షకులను ఆనందింపజేసేవాడు. తరవార ఈ నటుడు పల్లవి ఎత్తుకొని గాయకుల కందిస్తూ కధను నడప సాగినాడు. క్రమంగాల్ నాందీ-ప్రస్తావనలు, సంబాషణలు చొప్పించి ధెస్ సిస్ ఈ బృందగానాలను రూపకంగా రూపొందించినాడు. ఆ తరువార ఇస్కిలస్ (Aeschylus) అనే నాటకకర్త ఇద్దరు నటులను ప్రవేశ పెట్టినాడు. దానితో అసలు రూపకము గ్రీసుదేశంలో ఆవిర్బవించింది.