పుట:RangastalaSastramu.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కులు సిద్ధాంతీకరించినారు ఈ సిద్ధాంతానికి ప్రత్యేకనిదర్శల్నము వేట నృత్యము, కొండగుహలలోని ప్రాచీన కుడ్యచిత్రాలు.

అనాగరికజాతులలో వేటనృత్యము బహుళప్రచారంలో ఉన్నది. పీర్లపండుగలో పెద్ధపులివేషాలువేయడం మనదేశంలో పరిపాటి. పెద్ద పెద్ద మొక్కలు, చెట్లకొమ్మలతో అడవిగా అమర్చిన బండిమీద పెద్దపులి వేషగాడుల్ తిరుగుతూంటే వేటగాని వేషంలో ఇంకోవ్యక్తి ధనుర్భాణాలు పట్టుకొని నృత్యం చేస్తూ వేటాడడం నటించడం ప్రేక్షకులు మంచి రసవద్ఘట్టంలో డప్పుల మోతలతో హుషారుగా తప్పట్లు కొట్టడం. ఈలలు వేయడం నేడూ చూస్తున్నాము. దీనిని ప్రాచీనకాలపు వేట ప్రదర్శనానికి ప్రతిబింబంగా తీసుకోవచ్చు.

భారతచేశంలోని రామఘర్, మిర్జాపూర్ గుహలలో, స్పెయిన్ లోని కోగల్ గుహలలో కనిపించే కుడ్యచిత్రాలు కొన్నివేల సంవత్సరాల క్రితము చిత్రించినవని విమర్శకులు తేల్చిల్నారు. ఈ కుడ్యచిత్రాలు ఆ యా ప్రదేశాలలో లభ్యమయ్యే జంతువులను, వాటిని చేటాదే విధానాన్ని ద్యోతకముచేసే చిత్రాలు. మానవుడు వేటను వృత్తిగా పెట్టుకొని ప్రచారముచేసిన కాలంలో తన ప్రతాపాన్ని, వేటలోని ఆనందాన్ని కుడ్యచిత్రాలద్వారా వెల్లడించినాడు.అంతేకాదు తరవాత తరవార అక్కడకు వచ్చే తండాలవారికి ఆ పరికరాలను, అక్కడ లభ్యమయ్యే జంతు;వులను, వాటిని వేటాడే విధానాన్ని తెలియజేయడానికికూడా ఈ చిత్రాలు ఉద్దేశించబడి ఉంటాయి.

ఈ ఆధారలతో శ్రమనుంచి కళ - నాటకకళ ఆవిర్బవించినదని భావిస్తున్నాను.

దేవపూజా సిద్ధాంతము

పూర్వకాలంలో ప్రపంచములోని అన్ని గ్రామాలలో, పట్టణాలలో ప్రతి సంవత్సరము ఒకటి, రెండు పర్యాయాలు ఆయా గ్రామదేవతలకు జాతరలు చేయడం పరిపాటి. అట్లా చేయడంవల్ల ఆయాదేవతల అనుగ్రహలనికి పాత్రులై జనులు సుఖజీవనము గడప గలుగుతారని నమ్మేవారు. ఏవైనా అంటువ్యాధులు ప్రబలినా, కరవుకాటకాలు సంభవించినా అందుకు గ్రామ దేవతల ఆగ్రహమే కారణమని భావించి ఆయాదేవతల అనుగ్రహము పొందడానికి జాతర్లు చేస్తూ ఉండేవారు. అదృష్టవశాత్తు శుభము జరిగితే దానికి కూడా గ్రామదేవతల అను