Jump to content

పుట:RangastalaSastramu.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రమసిద్ధాంతము

న్నాటక" మని, 'All the world is a stage and all the men and women merely players" అని ప్రపంచానికి, నాటకానికి అభిన్నత చూపడంలో అర్ధం ఇదేనని భావించవచ్చు.

పిల్లల ఆటపాటలను ప్రాతిపదికగా చేసుమొని, విస్తృతపరచి, ప్రపూర్ణత చేకూర్చి తీర్చిదిద్ది రమణీయము చేయడంలో ఆవిర్బావించినవే రూపకము, రూపక ప్రదర్శనము, పిల్లల ఆటలనుంచి ఇట్లా ఆవిర్భవించినవి కాబట్టే నేటికీ లోకంలో నాటక ప్రదర్శనాన్ని తెలుగులో "ఆట" అని, ఇంగ్లీషులో "ప్లే" (Play) అని అంటున్నారు.

శ్రమసిద్ధాంతము

మానవులు వ్యవసాయము వృత్తిగా చేసుమొని ఒకచోట స్ధిరనివసమేర్పరచుకోకపూర్వము వేట వృత్తిగా, వేటజంతువుల మాంసమే ఆహారంగా ఒక చోటంటూ నిలకడగా ఉండకుండా జీవించేవారు. జంతువులను వేటాడడానికి, ఒంటరిగానో, తమ తండాలతోనో కలిసి వెళ్ళేవారు. కొన్ని కొన్ని జంతువులను మోసగించి పట్టుకోవడానికి ఆ జంతువువలెనే ప్రవర్చించేవారు. ఎస్కిమ్జోలు "సీల్" అనే జంతువులను, వాటివలెనే పొట్టమీద పాకుతూ వెళ్ళీ, పొడిచి చంపుతారు.

వేటలో మృగాలు దొరికినరోజు ఆ తండావారందరికీ పండుగ. రాత్రి గుమిగూడి ఆ మాంసము తిని, ఉల్లాసంగా గడిపేవారు. ఆ రోజు వేటాడినవారు తమ ప్రతాపాన్ని, వేట విదానాన్ని తమవారికి చూపి, తాము ఆనందించి తమ వారిని ఆనందింప జేయడమేగాక వారికి వేటవిధానము నేర్పవలెనని కుతూహలపడేవారు. ఒకడు మృగమువలె నటించగా, ఇంకొకడు వేటకాడై వేట విధానమంతా యధాతధంగా ప్రదర్శించేవారు. చివరకు మృగము పట్టుబడడమో, చనిపోవడమో ప్రదర్శించి, ఆనందంతో అంతా విరగబడి నవ్వేవారు. ఇట్లా వేటవిధానము ప్రదర్శిస్తూ ఉంటే పిల్లలు వారిని అనుకరించేవారు. ఇమ ప్రేక్షకులు ఆనందంతో తన్మయులై వేటగాండ్ర పాదవిన్యాసలయకు అనుగుణంగా తాళము వేసేవారు. ఉద్రిక్తత బాగా హెచ్చగానే చప్పట్లు, ఈలలు వేసి తమ ఆనందాన్ని వెల్లడిస్తూ ప్రదర్శకులకు హుషారిచ్చేవారు. ఈ ప్రదర్శనలో ఒకరు మృగంగా, ఒకరు వేటగాడుగా నిటించడంతోల్, ప్రేక్షకులు తన్మయులు కావడంతో రూపక మావిర్భవించిన దని, అందుచేత శ్రమలోనుంచి కళ ఆవిర్భవించినదని కొందరు లాక్షణి