పుట:RangastalaSastramu.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 రూపక నిర్వచనము Definition of Drama

రూపకోత్పత్తిని గురించిన వివిధసిదాంతాలను తెలుసుకొన్నాము. ఇప్పుదు రూపకలక్షణము నిర్వచించుకొందాము.

ఈ సాహిత్యప్రక్రియ ఇంగ్లీషులో డ్రామ (drama) అని, ప్లే (Play) అని అంటారు. అసలు 'డ్రామా ' అనేది గ్రీకుపదము. దాని అర్ధము చేసినవని (a thing done). ఈ పదము 'చేయడం' (to do) అనే క్రియాపదం నుంచి పుట్టించి. గ్రీకు లాక్షణికుడు అరిస్టాటిల్ "పొయటిక్స్" (Poetics) అనే తన గ్రంధంలో వివిధకళలలో ఉండే భేదాన్ని వివరిస్తూ ఈ విధంగా చెప్పినాడు.

"అందువల్ల ఒకవిధంగా చూస్తే ఉన్నతవక్తులను చిత్రించడంవల్ల- సోఫోక్లిస్ కూడా హోమర్ వంటి అనుకర్త అవుతున్నారు. మరొకవిధంగా చూస్తే వ్యక్తుల యధార్ధ చేష్టలను అనుకరించడంవల్ల సొఫోక్లిస్ అరిస్టోఫేన్సువంటి అనుకర్త కూడా అవుతున్నాడు. ఇట్లా చేష్టలను, అంటే వ్యక్తులచేష్టలను లేదా కర్యవ్యాపారాలను వ్యక్తీకరించే కావ్యాలు 'రూపకాలు ' ఆనంపడుతున్నవని కొందరి మరము" 1

వీటినిబట్తి అరిస్టాటిల్ అభిప్రాయమ్లో రూపకము "క్రియలను లేదా కార్యవ్యాపారాలను" చేసే మానవులను (men doing things) చూపుతుందని, అంటే క్రియాత్మకమైనదని, కధనాత్మకం కాదని తేలుతున్నది.

పాశ్చాత్య నాటకరచయితలలో ప్రముఖుడైన షేక్స్ పియర్ తన "హేమ్లెట్" (Hamlet) నాటకంలో నాటకలక్షణాన్ని ఇట్లా విస్పష్టంగా నిర్వ


(1) "So that from one point of view Sophocles is an imitator of the same kind as Homer - for both imitate higher types of character; from another point of view, of the same kind as Aristophanes for both imitate persons acting and doing. Hence, some say, the name of "drama" is given to such poems, as representing action"

POETICS, Butcher's Tranalations: III-7