పుట:RangastalaSastramu.djvu/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. వీలై నంతవరకు రంగస్థలందిగువస్థానాలు (down stage) ఖాళీగా ఉండవలె. ముఖ్యంగా దాని అగువస్థానంలోఉన్న పాత్రకు సంభాషణ లున్నప్పుడు ఈ ఏర్పాటు మరింత అవసరమవుతుంది. సంభాషణలున్నప్పుడు ఈ ఏర్పాటు మరింత అవసరమఫుతుంది. సంభాషణ చెప్పవలసిన పాత్రకు ఎదురుగా దిగువస్థానంలోఉన్న పాత్ర ఆ సమయానికి నిస్క్రమించటానికి గాని, ఆలస్యంగా రావటానికిగాని తగిన కారణాలను దర్శకుడు అంవేషించి పెట్టవలసి ఉంటుంది.

4. ఇరుపక్కల ఉన్న పాత్రలూ వీలైనంతవరకు పరిస్థితులకు అనుకూలంగా, లేచి నిలుచుండి సంభాషణలు చెప్పేవిధంగా దర్శకుడు జాగ్రత్త పడవలె.

5. దిగువ్వైపునఉన్న పాత్ర సంభాషణలు తన వరసలోనే ఉన్న ఇతర పాత్రలవైపుగాని, బల్ల చివరలౌన్న పాత్రలవైపుగాని తిరిగి చెప్పేటట్లురూపొందించవలె.

6. పరిస్థితులనుబట్టి, దిగువవైపు (down stage) పాత్ర స్థానంలో ఉండగా, ఎగువవైపు పాత్ర, ఆ సంభాషణ చెప్పటం తప్పనిసరి అయినప్పుడు దిగువస్థానంలోఉన్న పాత్ర, ఆ సంభాషణ పూ;ర్తిఅయ్యేవరకూ, వంగి వ్రాసుకొంటున్నట్లో, కిందపడిన వస్తువును దేనినో వెదుకుతున్నట్లో, కార్యకలాపము సృష్టించిన, ఎగువపాత్ర మరుగునపడకుండా దర్శకుడు జాగ్రత్త పడవలె.

సోఫాలో ఇద్దరు

రెండుపాత్రలను ఫొతోలో కూర్చుండబెట్టవలసివచ్చినప్పుడు ఆ సోఫా (చూ.పటము 23 కిడిచివర) బొమ్మలో మాదిగి ఎగువనుంచి దిగివకు అమర్చబడినప్పుడు- సంభాషణలు ఎక్కువఉన్నపాత్ర ఎగువస్థానంలో సోఫా ఆయన, తక్కువ సంభాషణలున్న పాత్ర దిగువస్థానంలో సోఫాలో వెనుకగాను కూర్చుండవలె.

సంభాషణలులేని ముఖ్యపాత్ర

అప్పుడప్పుడు సన్నివేశాంలో నాటకంలోని ముఖ్యపాత్రకు అసలు సంభాషణలు లేకపోవడాంగాని, ఉన్నా చాలా తక్కువగా ఉండడంగాని జరగవచ్చు. అట్లాంటి సందర్బంలో ఆ పాత్రను దృశ్యసమీకరణలో మధ్యస్థానంలో ఉండవలె. అట్లా ఉండటంవల్ల ప్రేక్షకదృష్టి మాటాడే ఒక పాత్రనుంచి మరొక