పుట:RangastalaSastramu.djvu/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంగస్థలంల్జో పక్కకుతిరిగిన స్థానంలోఉన్న నటుడు, తనకంటె రంగస్థలంలో ఎగువను ఉన్ననటుడు ఇంకొకపక్కగా ఎడంగా ఉన్నప్పుడు, ఆ నటునివంక పూర్తిగా తిరగనక్కలేదు. రంగస్థలంఒకపక్కనుంచి, మరొక పక్కకుచూస్తే చాలు. ఆ నటునివైపే చూసి సంభాషణ చెబుతున్నాడనే బ్రాంతి ప్రేక్షకులకు కలుగుతుంది.

ప్రత్యేకమైన పాత్రసమ్మేళన సమస్ల్యలు

గుండ్రని బల్లచుట్టూ నాలుగుపాత్రలు కూర్చోవలసి వచ్చినపుడు, చేయవలసిన దృశ్య సమీకరణపద్ధతి కిందిబొమ్మలో ఉన్నది. అయితే ఒక కోణంలో ఉంచిన నలుచదరంబల్ల అయితే ఈ పద్ధతి బొమ్మలోవలెనే ఉండవలె.

నలుచదరం బల్లకన్న పొడుగుపాటిబల్ల దృశ్య సమీకరణకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. పొడుగుపాటిబల్ల దగ్గర ఎక్కువమందిల్ని కూర్చోబెట్టవలసివచ్చినప్పుడు బల్లను కోణంలో ఉంచడవంటి పద్ధతులు ఎక్కువ ప్రయోజనకరంగా ఉండవు. అప్పుడు--

1. బేసిసంఖ్య గల పాత్రలుంటే ఒక ప్రత్యేకపాత్రను రంగస్థలం అగువవైపు (upstage) స్థానంలో కూర్ఛోబెట్టవలె.

2. అత్యంత ప్రాముఖ్యంగల పాత్రను ఎడమ చివరకు, మిగతా పాత్రలను ప్రాముఖ్యాన్నిబట్టి, సంఖ్యనుబట్టీ సర్ధవలె. చిన్నవీ, తక్కువ ప్రాముఖ్యము కలవీ అయిన పాత్రలను ప్రేక్షకులవైపు దిగువను (down stage), ప్రాముఖ్యంగల పాత్రలను రంగస్థలం ఎగువను (upstage) కూర్చోబెట్టవలె. వీలుగాఉంటే, ఎగు;వవైపు కూర్చున్నపాత్రల కుర్చీలలో దిండ్లు వేయడంవల్ల, ఎత్తు ఏర్పడి వారు ప్రేక్షకులకు సులభంగా కనిపించే అవకాశమేర్పడుతుంది.