పాత్రసమ్మేళనలో నటులస్థానాలు, వారికున్న సంభాషణల ఎక్కువ తక్కువలనుబట్టి ఉండవలె. సంభాషణచెప్పే నటుడు, వినేనటుడు, దగ్గరదగ్గర ఒకేవరసలో ఉండవలె. ఎక్కువ సంభాషణలున్ననటుడు రంగస్థలంఎగువవైపు (upstage) ఉంఛవలె. ఇద్దరు నటులకు సమానమైన సంభాషణలున్నప్పుడు, వారిద్దరు రెండుకోణాలలో ఒకేసరసన సమీకరించబడవలె (చూ.పటము22). ఒక సంభాషణ కొందరిలోఉన్న ప్రత్యేకవ్యక్తికిగాని, సమూహంలోఉన్న అందరికీ సమిష్టిగాగాని చెప్పవలసివచ్చినపుడు, మాటాడేనటుడు ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నవ్యక్తివంకచూసి మరీచెప్పవలె. అట్లాగే, నేపధ్యంలోఉన్న వస్తువును రంగస్థలంమీదౌన్న పాత్ర సంభాషణచెబుతూ, చూడవలసి వచ్చినప్పుడు, ఆ చూపు వీలైనంతవరకు ప్రేక్షకాభిముఖంగా ఉండవలె.
సిగ్గుచేత, అవమానంచేత, మానసికంగా దెబ్బతినడంచేత మనుష్యులు వెనుదిగురాతు. అట్లాంటిపాత్రలను ప్రేక్షకులకు సమీపంగా ఉండడంవల్ల తక్కిన పాత్ర ప్రేక్షకాభిముఖంగా ఉండేవీలు ఏర్పడుతుంచి.
విరుద్ధ కారణాలు
ప్రేక్షకులవైపు నటుడు తిప్పడానికి నాటకీయంగా కారణమేర్పడినప్పుడు, ఆ తర్వాత, ఆ కారణాన్ని అధిగమించి నటుడు తిరిగి ప్రేక్షకాభిముఖముకావడానికి తగిన కారణాన్ని, పరిస్థితులను దర్శకుడు సృస్థించవలె. నటుడు ప్రేక్షకులవైపునుంచి వెనుదిగరటానికి కష్టమయ్యే శరీరపరిస్థితి (అనగా వెనుతిరగటం, శరీరానికి ఇబ్బంది కలిగించేటట్లు కూర్చుండబెట్టటంఫంటిల్ ప్రక్రియలు) ఈ సమస్త్యకు కొంత పరిష్కారమార్గ మవుతుంది. వెంటనే తిరిగి ప్రేక్షకాభిముంఅకు కావఋఆనికి, అవసరమయ్యే చిన్న వ్యాపారము (Business) సృష్టించడం మరొకపద్దతి. ఉదాహరణకు పురోరంగమువైపుకు (down stage) ఏదో వస్తువునుంచి, అది తీయవలసిన అవసరము కల్పించవచ్చు.
హాస్య సంభాషణలు, పూర్తిగా ప్రేక్షకాభిముఖంగా చెప్పడంవల్లె మరింత శక్తిని కలిగిస్తాయి. అందుచేత, ఆ సంభాషణచెప్పే పాత్ర అటూ ఇటూ తిరిగే కారణాలు సృష్టించి, నవ్వును పుట్టీంచే హాస్యసంభాషణ (laugh line) పూర్తిగా ప్రేక్షకాభిముఖంగా ఉన్నప్పుడే చెప్పించవలె.