Jump to content

పుట:RangastalaSastramu.djvu/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నటుడు 90 డిగ్రీస్ కన్న ప్రేక్షకులనుంచి తిరిగినప్పుడు, అతని ముఖము మరుగుపడిపోతుంది. ఈస్థానంలోఉండి అతడు మాటాడినప్పుడు "వెనుదిరిగి మాటాడటం" (talking upstage) అవుతుంది. ఇదిగాక, ఇతరస్థానాలనుంచి సంభాషణ చెప్పినప్పుడు అది ప్రేక్షకాబిముఖంగా చెప్పినట్లు (talking down stage) అవుతుంది (చూ.పటము 22).

వెనుదిరిగి మాటాడటంవల్ల కింది ఇబ్బందు లేర్పడాతాయి:

1. కంఠస్వరముతగ్గి ప్రేక్షకులకు వినిపింపచేసే ప్రయత్నంలో గట్టిగా అరవవలసిన అవసరము.

2. ప్రేక్షకులు నటుని పెదవులు చూసేవకాశము లేనందువల్ల, ఏపాత్ర మాటాడుతున్నదీ, తెలుసుకోలేని ఇబ్బంది

3. ప్రేక్షకులవైపు వీపుతిప్పడంగల్ల సంభాషణ చెప్పేటాప్పుడు నటునికి అవసరమైన ప్రాముఖ్యాన్ని కోల్పోవడం; ముఖంద్వారా, హావభావ ప్రకటన చేయడానికి అవకాశము లేకపోవడం.

సన్నీవేశంలో సంభాషణప్రాముఖ్యము లేనప్పుడూ, ప్రేక్షకులకు ఆమాటలు ఎట్టికుతూహలాన్నీ కలిగించవలసిన అవసరములేనప్పుడూ, ఆసంభాషణ, తిరిగి తిరిగి చెప్పబడేటప్పుడూ, మాటలతోపాటు అవి అర్ధమయ్యే కార్యకలాపాలు జోడింపబడినప్పుడూ (ఉదా: "ఈ సిగరెట్టుతీసుకో" అనే సంభాషణతోపాటు, సిగరెట్టుపెట్టె తెరిచి చేయిచాపి ఇచ్చినప్పుడు) ఈ బాధాంతగాఉండదు. అనేకమైన ఇతరసందర్భాలలో "వెనుదిరిగిమాటాడడం" అనేసమస్య చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అందుచేత, ఆ నటుని ప్రేక్షకాభిముఖంగా తరవాతచేసే నాటకీయ మైన కారణాన్ని దర్శకుడునేర్పుతో ఊహించవలె; లేదా ప్రేక్షకులకు తిరోభిముఖంగా నటుడు తిరగవలసిన కారణాన్ని తప్పించవలె. ఇట్లాంటి సమస్యలు నాటకప్రయోగంలో సర్వసాధారణముకాబట్టి, వీటిపరిష్కారమార్గాలు దర్శకుడు, నటీనటులు తెలుసుకోవలసిఉంటుంది.