రాలు మోతాదుకు మించిచేయటంలో, రసభంగము కలుగకుండా దర్శకుడు జాగ్రత్తపడవలసి ఉంటుంది.
ఒక్కొక్కసారి, నటుడు తానుచెప్పబోయే సంభాషణ ప్రారంబిఅబోయేముందు, ప్రేక్షకులదృష్టిని తనపై కేంద్రీకరిపజేసే ఉ;ద్దేశంతో రంగస్థల వ్యాపారాన్ని ప్రత్యేకంగా ప్రయోగించటం జరుతుంది. అంతకుపూర్వము, ఆ పాత్ర మౌనంగా, జడంగా ఉన్నప్పుడు, తానుచెప్పబోయేసంభాషణ నాటక ప్రద్ర్శనలో ముఖ్యమై, అది ప్రేక్షకులు మరవకూడని దైనప్పుడు మాత్రమే ఇది సాధారణంగా ఉపయోగింపబడవలె. అట్లాంటి సందర్భాలలో ప్రేక్షకులదృష్టి ఆ సంభాషణచెప్పే నటునిపై కేంద్రీకృతమవుతుంది. ఇట్లాంటి కార్యకలపాలు, నాటకరససిద్ధికిగాక నటుల అవవసరవ్యక్తిగత ప్రజ్ఞాపరకటనకుమాత్రమే ఉపయోగించే ప్రమాదంకూడా ఉన్నది. ఇట్లాంటిసందర్భాలలొ దర్శకుడు నిర్ధాక్షిణ్యంగా అట్టిప్రయత్నాలను అప్పటికప్పుడు తుంచివేయవలె.
ఒక్కొక్కప్పుడు ఒక ప్రత్యేకదృశ్యము, మరొకప్పుడు పూర్తి ప్రదర్శన నిండుగా కనిపించదు. దీనికిముఖ్యకారణము సర్వసాధారణంగా, అది సంభాషణప్రాముఖ్యము గలిగిఉండటమే. సంభాషల్ణలు ఎంతప్రతిభావంతంగా ఉన్నా, కొన్ని రంగస్థల వ్యాపారాలు వాటికిచేర్చనిదే నిండుతనమురాదు. ఈ వ్యాపారాలు కొట్టవచ్చినట్లు కనబడకపోయినా, ప్రదర్శనవిజయానికి ఎంతైనా సాయపడతాయి.
ఉదా: ఒకస్త్రీపాత్ర బియ్యంలో బెడ్డలు ఏదుకొంటూ లేదా, పాతగుడ్డకుట్తుకోంటూ లేదా, ఎంబ్రాయిడరీచేస్తూ లేదా, ఒక పురషపాత్ర, పొగాకుపాయ సరిచేసి, చుట్ట చుట్టుకొంటూ సంభాషణలు చెప్పటం ఎంతో రక్తినిస్తుంది.
పాత్రచిత్రీకరణకు దోహదముచేసే రంగస్థల వ్యాపారము
పాత్రోచితమైన రంగస్థలవ్యాపారము పాత్రను మరింత పుష్టికరంగా రూపొందించటానికి ఎంతో సాయపడుతుంది. ప్రతి పాతకు ఒక ప్రత్యేక రంగవ్యాపారము స్వభావసిద్ధంగ్గ పూర్వాభ్యాసము (rehearsals) ప్రారంభించక పూర్వమే దర్శకుడు రూపొందించి, కేటాయించడం ఎంతో అవసరము. ఉదాహరణకు సిగరెట్టు కాల్చడం తీసుకొంటే---- 1. పొడుగు హోల్డరులో సిగరెట్టు సుతారంగా పెట్టి కాల్చటం, లేదా 2. బొటనవేలుకూ చూపుడువేలుకూ మధ్య సిగరెట్టు ఉంచుకొని, అరచేతిచాటున ఉంచి దమ్ములాగటం మొదలయినవి