పుట:RangastalaSastramu.djvu/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. పాత్రల మన:స్థితి సూచించే రంగస్థల వ్యాపారము

మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రకటించవచ్చు.

4,పాత్రక అంతర్గత భావప్రకటన

పూర్వపు రోజులలో పాత్రలు అంతర్గత భావప్రకటన ప్రేక్షకులకు వినిపించేటట్లు సంభాషణలు (పక్కపాత్రలనుద్దేశించినవి) చెప్పటాంద్వారా సాధింపబడేది. ఇట్లా సంభాషణ చెప్పే పాత్రలు రంగస్థలంమీద ఏకాంతంగా ఉంటే, ఆ మాటలు "స్వగరము" (soliloquy) అనబడేవి. ఈస్వగగాలు చలావరకు సుదీర్ఘంగా ఉండేవి. అట్లుగాక పక్కపాత్రలు రంగస్థలం మెద ఉన్నప్పుడు, అవి చిన్నవిగా ఉన్నప్పుడు "ఆత్మగతము" (aside) అనబడేవి. ఈ రకమైన పద్దతులు పాతకాలపు పద్ధతులుగా వదలివేయబడినాయి. ఇప్పటి నటీనటులు తమ ఆత్మగత భావాలను ఏదోరంగస్థల వ్యాపారంవల్లనే అందజేసేపద్ధతిని అవలంబిస్తున్నారు. పూర్వపు రోజులలో ఒక పాత్ర. ప్రేక్షకుల వంకకు తిరిగి- "ఆ! మాల్ప్ల ఆలోచన తట్టించి" అనడం మామూలుగా జరిగేది. కాని ఈ నాటి పద్ధతి ప్రకారము ఒక చిటికెవేసి అదే భావాన్ని నటుడు ప్రకటింప గలుగుతున్నాడు. కేవలం "కిటికీ తరవటం" అనే వ్యాపారము ఏ భాన్నీ ప్రకటించక పోవచ్చు: కాని కిటికీతరవటంతోపాటు, జేబురుమాలుతో విసరుకోవటం గరిలో గాలి ఆడక ఉక్కపోస్తున్న భావాన్నికూడ సుస్పస్టముచేస్తుంది.

కొన్నిరంగస్థలవ్యాపారాలు, సక్రమకాలనిర్ణయంతో చేయబడితే-- ఒక భావాన్ని మరింతపటిష్టంగా ప్రేక్షకులకు వ్యక్తముచేయడానికి సాయపడతాయి.

ఉదా: ఒకపాత్ర కంటిఅద్దాలు తుడుచుకొంటూ అకస్మాత్తుగా అది పైకెత్తి, ఒకకన్నుమూసి, రెండోకంటితో అద్ధాలలోనుంచిచూస్తే, ఆ వ్యాపారము మరింతపుష్టిపొందుతుంది. కత్తిని బల్లమీద గుచ్చటంవంటి రంగ వ్యాపా