భిన్నస్వభావ చిత్రీకరణలను సూచించగలవు. ఇట్లాగే హాస్యసన్నిచేశ నిర్వహణకు, ఉచితమైన రంగస్థలవ్యాపారాలను ప్రవేశపెట్టవచ్చు. హాస్యప్రధానమైన నాటకాలలో ఇవి ఎప్పుడుపడితే అప్పుడు ప్రవేశపెట్టినా, నాటకౌచిత్యము చెడదు. తక్కిన నాటకాలలో రసభంగము కాకుండా, హాస్యసన్నివేశాలను;, రంగస్థల వ్యాపారము మలచుకోవలె. ఈ జాగ్రత్త చాలా అవసరము.
ఒక్కొక్కసారి నాటకగమనంలో ఖాళీలు-విరామాలు (gaps) ఏర్పడి రంగస్థలంలో ఏ రంగస్థల వ్యాపారమూ లేక స్తంభించటమో, లేదా ఉన్నపాత్ర ఓకటేఅయి, ఆతర్వాత పాత్రప్రవేశానికి వ్యవధి ఉండడమో జరిగినప్పుడు, సందర్భోచితంగా తగిన చిన్న రంగస్థల వ్యాపారము ప్రవేశపెట్టవలె.
అట్లా ప్రవేశపెట్టే ప్రతివ్యాపారానికీ ప్రత్యేకమైన ఉద్ధేశము ఉంటే, నాటకప్రధానోద్దేశము మరుగునపడి, దెబ్బతినే అవకాశమేర్పడు తుందనే విషయము దర్శకుడు మరువరాదు. కాబట్టి రంగస్థలంమీద ఉన్న వస్తుసామాగ్రితోనే, వైవిధ్యంతో కూడిన రంగస్థలవ్యాపారము రూపొందించుకోవలె. ఒకే విధమైన రంగస్థలవ్యాపారంతో, వివిధ భావాలను, ఉద్దేశాలను ప్రకటించే ప్రయత్నము ప్రేక్షకుల మనస్సులో గందరగోళము కల్పించే అవకాశము ఉంటుందని, ముందు స్థూలంగా కనిపించినా అది నిజముకాదు--
ఉదాహరణకు: నాల్గడుగుల దూరంలోఉన్న బల్లదగ్గరకు వెళ్లి, దానిమీద ఉన్న ఫాన్ స్విచ్ వేయటం- అనే ఒకే రంగస్థల వ్యాపారంవల్లె--
1. కదలటంలోని ఉద్దేశము.
2. వాస్తవిక వాతావరణ భ్రాంతి
3. సంవత్సరంలో అది ఏ కాలమో (వేసవి) సూచించడం,
4. వాతావరణము (వేసవి),
5. పాత్ర యొక్క మన:స్థితి, (వేడికి తట్టుకోలేని పరిస్థితి)
రెలియ జేయటమేగాక అదనంగా--
1. రంగస్థలం మీద అమర్చిన వస్తువును (ఫాన్) ప్రేక్షకుల ప్రత్యేక దృష్టిని ఆకర్షించేటట్లు చేయటం.
2. పాత్ర ఎండవగైరాలను తట్టుకోలేని ప్రత్యేక మన:స్థితిలో ఉన్నాడని విశదపరచడం.
3. నాటకగమనంలో అవసరమైన నాటకీయత లేదా హాస్యధోరణి వగైరాలు సందర్భానుసారంగా ప్రకటించటం--జరుగుతుంది. ఈవిధంగా ఎన్ని రంగస్థల వ్యాపారాలు దర్శకుడు సృస్టించగలితే నాటక మంత పుష్టిచెంది, ప్రేక్షకాదరణ పొందుతుంది.