పుట:RangastalaSastramu.djvu/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. అవసరానికి మించిన ద్వారాలు ఉండటం ఇబ్బంది. ఉపయోగించని ద్వారాలు ప్రేక్షకదృష్టికి వికర్షణ కలిగించి, ప్రదర్శనస్థాయిని తగ్గించే ప్రమారము ఉంటుందని మరవరాదు.

3. ప్రతి ద్వారము దానికి అవతలగల ప్రదేశానికి సంబంచించినదై ఉన్నట్లు ప్రేక్షకులకు అర్థమయ్యేవిధంగా రూపొంచించవలె. నటీనటుల సక్రమ ప్రవేశ నిష్క్రమణాలద్వారా, ఆ ప్రదేశాలకు ప్రేక్షకులు అర్ధముచేసుకొనే టట్లుగా అ కదలికలు రూపొందించవలె. ఒక్కొక్కసారి, ఒకే ద్వారాన్ని అనేక ప్రదేశాలకు మార్గంగా సూచించవచ్చు. కుడికి తిరగటం, ఎడమకు తిరగటం, తిన్నగా వెళ్ళటం మొదలైన వైవిద్యంగల చలనాలవల్ల విభిన్నప్రదేశాలు సూచించవచ్చు.

4. రంగస్థలంమీద ఏర్పడబడిన ద్వారాలు నిజజీవితంలోను, వాస్తవిక పరిస్థితులలోను ఉండేవాటిని పోలిఉండే, తలుపులు తరవటంలోను, మూయటంలోను నటుడు సాధించే చలన విశేషాఅలవల్ల విభిన్నమైన అర్ధాలను, భావోద్వేగాలను సూచించవచ్చు. దృశ్యంలోని చలనము రంగస్థలంలో ఒకేవైపున కేంద్రీకరించకుండా ప్రఫేశనిష్క్రమణాల విషయంలో దర్శకుడు శ్రద్ధ వహించవలె. ప్రేక్షకదృష్టి సరిఅయిన స్థానాలపైన, చలనాలపైన కేంద్రీకరించవలె.

5. ప్రవేశ నిష్క్రమణాలు ప్రేక్షకులకందరికి కనిపించేటట్లు రూపొందించవలె.

6. కనీసము కొన్ని ప్రవేశద్వారాలు రంగస్థలం దిగువను ఏర్పరచవలె. ముఖ్యంగా దీర్ఘ సన్నివేశాలలోనూ, లోతు ఎక్కువగల అభినయావరణగల రంగ సజీకరణలోనూ దీని ప్రాముఖ్యమెక్కువ.

7. ద్వారాలు రంగస్థలం దిగువవైపుకుఎరుచుకొనేటట్లు ఏర్పాటు చేయవలె.

8. ముందుతెరకు మరీ దగ్గరగా పకాద్వారాలు ఏర్పాటుచేయటం తగదు.

ద్వారాలవలెనే కిటికీలు ఏర్పాటు చేసేటప్పుడు రంగచలనం దృష్ట్యా ప్రత్యేకశ్రద్ధ అవసరము. ప్రేక్షకులు కిటికీగుండా చూడవలసిన అవసరము ఉన్నప్పుడు అది రంగస్థలంఎగువనూ, నటీనటులు చూఛవలసినప్పుడు పక్కనూ ఉంచటం మంచిది.