పుట:RangastalaSastramu.djvu/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4 నిజాయితీ లోపించిన లక్షణాలు గల పాత్రలు గల పాత్రలు, ప్రాముఖ్యంలేని పాత్రలు, రంగస్థలం ఎగువభాగం (upstage) నుంచి కలలికలు సాధించటం సముచితమైన పద్ధతి.

గతివిన్యాసంలో పద్ధతులు

గరివిన్యాసంలో పద్ధతులు

గతివిన్యాసము రంగస్థలంలోని పాత్రలు ఒకచోటినుంచి మరొక చోటికి కేవలము మారటానికేగాక్, దృశ్యంయొక్క అర్ధాన్నీ, శైలినీ, భావావరణాన్నీ పాత్రల స్వభావ వైచిత్రినీ చిత్రీకరింఛే శక్తికలిగి ఉంటుందు. దృశ్య సమ్మేళనము (grouping) దీనికి వన్నెతెస్తుంది. దృశ్యసమ్మేళనము, చలనము ఒకదానిలో ఒకటి కలసిపోతాయి. నిజానికి అవి రెండూ గతివిన్యాసానికి సంబందించినవే. దర్శకుడు నాటక సమగ్రరూపము దృష్టిలో ఉంచుకొని కళాత్మకంగా ప్రయోజనకరంగా, డృశ్యానుకూలంగా గతినిరూపణము చేయవలె.

అంగవిక్షేపము (Gesture)

చలనాన్ని గూర్చి ప్రస్తావించినప్పుడు రంగస్థలంలోని నటీనటుల కదలికలేగాక ఆ నటీనటుల అంగవిక్షేపాలు కూడ ప్రస్తావనకు వస్తాయి. నటుని అంగ, కర విక్షేపాలు, సంభాషణలోని అర్ధాన్నీ అంతరార్ధాన్నీ పాత్ర ప్రకృతికి అనుగుణమైన సవభావలక్షణాలను సూచించే విధంగా రూపొందించబడవలె.

ప్రవేశ నిష్క్ర్మణాలు

ప్రవేశ నిష్క్రమణాల విషయంలో దర్శకుడు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవలె, అట్లా చేయటంవల్ల, రంగచిత్రము (stage picture), రంగప్రక్రి;యలు (Stage actions) ఆకర్షణీయంగా రూపొందుతాయి.

సాధారణంగా, ప్రతి నాటకంలోను మూడుద్వారాలు- రెండు రంగస్థలానికి ఇరుపక్కలనూ, మరొకటి రంగస్థలం ఎవుగనూ- ఉంటే ప్రయోగ సౌలభ్యమేర్పడుతుంది. రంగచలనానికీ ఆకర్షణీయమైన రంగచిత్రానికీ అవసరమైన ద్వారాలు లేకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రవేశనిష్క్రమణాల విషయంలో దర్శకుడు ఈ క్రింది సూచనలు పాటిస్తే చక్కని ఫలితాలు సాధించవచ్చు--

1. కధాసంవిధానము పుష్టిగానూ, సూటిగానూ చెప్పేటందుకు అవసరమైనన్ని ద్వారాలు ఉండవలె.