ఇది ఎంత చిన్న కార్యకలాపమైనా ఫరవాలేదు. అప్పుడు ఆ పాత్రపైన ప్రేక్షదృష్టిలోని ఏకాగ్రత చెడదు.
3. లేదా, ప్రతి మూడడుగుల కదలిక తరవాత పక్కపాత్ర చేత సంభాషణలుగానీ, ఏదో కార్యకలాపంగానీ చేయించవలె. ఇట్లాంటి సందర్భంలో ప్రేక్షకదృష్టి క్షణికంగా ఆ పక్క పాత్రలవైపు మళ్లుతుంది.
4. లేదా, అడుగు వెయ్యడంలో గమనవేగము మరీ హెచ్చించడం గానీ, మరీ తగ్గించటంగానీ చేయటంద్వారా వైవిధ్యాన్ని సాధించవలె.
గతివిన్యాసంలో రకాలు
రంగస్థలంలో ఉండేవస్తువులు
అడ్డంగా ఉండటంవల్లనేగాక, ఖాళీగా
ఉన్న ప్రదేశంలోకూడా వంపుతిరుగుతా
యనేది. కాని నటుడు రంగస్థలంమీద
మరొకనటుని దాటి వెళ్ళటంలో అనేక
సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు.
దృశ్యసౌలభ్యం దృష్ట్యా కిందివిధంగా
రూపొందించవలె.
1. స్థిరంగా ఉన్న నటుని
మరొక నటుడు దాటవలసి వచ్చి
నప్పుడు ముందువైపునుంచి దటి
పోవచ్చు.
2. అట్లుగాక, నటుని వనక
నుంచి, ఇతర పరిస్థితులవల్ల, దాట
వలసి వచ్చినప్పుడు స్థిరంగాఉన్న
నటునివనక తాను మరుగుపడినప్పుడు
సంభాషణ ఆపివేసి, మరుగునించి
వెలికివచ్చిన తరవాత తిరిగి సంభాషణ
మొదలుపెట్టవలె.
3. స్థిరంగా ఉన్న నటుడు
కూర్చుండి ఉన్నప్పుడు వెనకనుంచి
దాటి రావటమే సరిఅయిన పద్ధతి.
|
|