పుట:RangastalaSastramu.djvu/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది




నాటకాన్ని రసవత్తరంగా, సజీవంగా, పుష్టికరంగా రంగస్థలంమీద రాణింపజేసేది ఆకర్షణీయంగా రూపొందించిన రంగస్థల వ్యాపారము. సంబాషణలు, ప్రవేశ నిష్క్రమణాలు, కద్లికలు గాక తక్కిన నటప్రక్తియలన్నింటిని కలిపి 'రంగస్థల వ్యాపారము ' అంటారు.

ఉదా: పాత్ర ప్రకృతి లక్షనాలనుబట్టి, మాటాడుతూ కోటుగుండీలు తిప్పడం (ఇది కంపాన్ని సూచించవచ్చు), ఉత్తరాలు, వ్రాయటం, చెక్కుల మీద సంతకాలు చెయ్యటం, కాఫీ ఫలహారాలు అందివ్వటం, పుస్తకాలూ వాత్రాపత్రికలూ చదవటం, టెలిఫోను చేయటం, కనబడని వస్తువులకోసము డ్రాయర్లు వెతకటం-- ఇవన్నీ రంగస్థల వ్యాపారాలే.

అంతర్గత వ్యాపారము (Inherent Business)

ఇది అనేకవిధాలు--

1. నాటక కధాసంవిధానానికి అవసరమైనవి.
2.నాటక గమనానికి అవసరమైనవి.
3.నాటక వాస్తవిక వాతావరణదృష్టికి అవసరమైనవి.

ఒక్కొక్కప్పుడు రంగస్థలంమీద అవసరమైన వస్తు;వు ఉపయేగించవలసిన సమయానికి, అది రంగస్థలంమీద ఒక పాత్రద్వారా చేర్చటానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. అంతవరకు నాటకగమనము నిలిచి పోకుండా దర్శకుడు నేర్పుతొ ఏదో ఒక వ్యాపారము ఏర్పాటుచేసుకోవలె. ఈ వ్యాపారంఏర్పాటులో కింది సూచనలు ప్రదర్శన రక్తికట్టడానికి ఎంతో తోడ్పడతాయి.

1. వస్తూపయోగంతోపాటు, రంగస్థల వ్యాపారంతో తగిన వ్యవధి కల్పించటమేగాక, కొన్ని చెణుకులుకూడా ప్రయోగించవలె.