పార్శ్వగతి విన్యాసాలు (Sidewise Movement)
పక్క పాత్రలతోడి సంబందంవల్ల పాత్ర దగ్గరగా రావటం. లేక దూరంగా జరగటం సంభవిస్తుంది. ఈ సంబంధం స్పష్టంగా లేనప్పుడు పాత్ర పక్కపాత్రను చుట్టటం జరుగుతుంది. పూర్తి వలయాకారమైన (circular) కదలికలు రంగస్థలంమీద అరుదు. చిన్న వంపులు (small arc;) వంటి కదలికలు, ఒకటిరెందు అడుగులకు పరిమితమయ్యేవి. సాధారణంగా ఉంటాయి. ఇట్లాంటి కదలికలు సందేహాన్ని, అనిశ్చితత్వాన్నీ వ్యక్తపరుస్తాయి. అంతేగాక, సాంకేతికంగా దృశ్యం కాలవ్యవధి ఎక్కువై, చలనానికి పరిధి తక్కువైనప్పుడు కూడా ఈ పార్శ్వగతిచలనాలు ఉపయోగింపబడతాయి.
198 పేజీలోనిబొమ్మలో (చూ.పటము 12 C) ప్రియురాలు D.R స్థానంలోఉన్న సోఫామీద కూర్చుండిఉండగా ప్రియుడు దగ్గరకు వచ్చి మధుర భాషణలు చెయ్యవలె. ప్రియునిపైన ప్రియురాలి ఆకర్షణశక్తి ఎక్కువగా ఉంటుంది. కొంత సంకోచ్ము ఉన్నా, ప్రియురాలికి దగ్గరగా చేరవలెననే ఆతురత ఉంటుంది. కాని అతడు దృశ్యంలో రంగస్థలంమీద మూడడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఒక్కొక్క అడుగు, ఒకదానివెంట మరొకటి వేసుకొంటూపొతే దృశ్యపోషణకు వైవిధ్య నిరూపణ చాలదు. కాబట్టి, మొదటి చలనభాగంగా ఒక అడుగు ముందుకువేస్తాడు. ఇప్పుడు మిగిలిన రెండడుగుల దూరము తగ్గకుండా, చలనము ఆగకుండా ఉండేటందుకు- రెండవ చలనభాగంగా వక్రంగా రంగస్థలం ఎగువ (up stage) వైపునకు రెండడుగులు వేస్తాడు. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు, ఆ తరవాత తిరిగి రెండు వంపుటడుగులు రంగస్థలం దిగువకు (down stage) వేయటంతో నాలుగు చలనభాగాలు రూపొందురాయి. అయిదవ అడుగుతో ప్రియుడు ప్రియురాలి దగ్గరగా వస్తాడు.
ఈ రకంగతివిన్యాసంవల్ల వైవిధ్యము. పాత్రయొక్క మన:స్థితి ప్రకటించటం, అదనంగా రెండు గతివిన్యాసవిశేషాలు రూపొందించటం, సాధ్యమౌతాయి. ప్రియుడు రంగస్థలం ఎగువకు కదలిక (upstage movement) తీసుకొన్నప్పుడు- ముఖ్య సంభాషణ ఏవైనా ఉంటే ప్రియురాలిపైన అవసరమైన ప్రేక్షకదృష్టి సమీకరణ సాధ్యమవుతుంది.