పుట:RangastalaSastramu.djvu/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకృతి విన్యాసాలు

ఎక్కువైనప్పుడు సహజర్వము తగ్గుతుందనే సత్యాన్ని మరవరాదు (చూ.పటము 12).

ప్రకతి విన్యాసలు (Curved Movements)

రెండు స్థిరకేంద్రాలమధ్య ఉండే తక్కువదూరము, తిన్నని గీత అయినప్పటికీ-పరిశీలిస్తే నిత్యజీవితంలో మనము తిన్నగా ఉండే మార్గంలో కదలటానికి ఎక్కువగా ఇష్టపడము. ఉదాహరణకు ఖాళీపొలాలనో, మైదానంలోనో పరిశీలిస్తే, కాలిబాట ఎప్పుడూ వంకరటింకరగా ఉంటుందేతప్ప తిన్నగా ఉండదు. మనోభావాలు స్థిరమైనవీ శక్తిమంతమైనవీ కానప్పుడు- వంపుగా నడవటం పరిపాటి. ఒకటికన్న ఎక్కువ భావ సంబంధాలు కలిగి ఉన్నప్పుడు వంకరటింకర కదలికలే ఉంటాయి (చూ.పటము 1`2)

ఒక మనిషి గాలికోసము కిటికీదగ్గరకు వెళ్ళినప్పుడు, సరాసరి నడిచి వెళ్ళే సావకాశము ఉన్నప్పటికీ, సోఫా తగలకుండా వెళ్ళే ఉద్దేశంతో వంపు తిరుగుతాడు. కాని చాలాకాలంకిందట కలసిన స్నేహితుని కంఠస్వరము కిటికీలోనుంచి వినిపించినప్పుడు ఏ వంకరా తిరగకుండా సోఫానూ, అది ఉన్న స్థానాన్నీ విస్మరించి సరాసరి కిటికీవద్దకు వెడతాడు. వంపుకదలికలలో రెండు సదుపాయాలు (advantages) ఉంటాయి.

1. అని సమగతి (Straight) కదలికలకన్నా చూడముచ్చటగా ఉంటాయి.

2. అవసరమైన వంపుమార్గాన్ని అనుసరించటంవల్ల, ఆ కదలిక చివర, నటుడు తాను అవసరమైన కోణంలో ఆ కదలిక పూర్తి చేసుకొనే అవకాశము లభీస్తుంది. అట్లాగాక, శక్తిమంతమైన కారణం ఫలితంగా, తిన్నగా కదలిక రూపొందించుకోవలసి వచ్చినప్పటికీ, ఆ కారణానికి విరుద్ధంగా తాను చివరకు తిరగవలసివస్తుంది. రంగస్థలం ఎగువకు, వక్రగతివిన్యాసంవల్ల నటుడు ప్రేక్షకాభిముఖంగా ఉండేటట్లు రూపొందించే ఆ కదలిక నటునికి వీలుగా ఉంటుంది. ముఖ్యంగా నటునికి ఈ చలనంతోపాటు సంభాషణకూడా కలిసి ఉన్నప్పుడు, సంభాషణ చివరిభగము (సాధారణంగా ముఖ్యభాగము) ప్రేక్షకాఃభిముఖంగా ఉండటంవల్ల స్పష్టంగా వినబడటమేకాక నటుని ముఖంలో ప్రకటితాలైన భావాలు ప్రేక్షకులు చూడగలిగే అవకాశంకూడా సాధ్యమై, నాటక రసదిద్ధికి ఎంతో తోడ్పడుతుంది.