Jump to content

పుట:RangastalaSastramu.djvu/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గతివిన్యాసంయొక్క ప్రాధాన్యము. శక్తి (Emphasis and Strength is Movement)

శక్తి, ప్రాధాన్యము సర్వసాధారణంగా కలిసిఉంటాయి. కాని, అవి విభిన్నాలైనవి. ఒకే పాత్ర శక్తిలోపించి బలహీనమైనప్పటికీ, ప్రాధాన్యము (emphasis) కలిగి ఉండవచ్చు.

అట్లాగే వివిధ చలనరూపోఅలలో చలనంయొక్క శక్తి, ప్రధాన్యము విభిన్నంగా ఉండవచ్చు. ప్రతి చలనంలోను అంతర్గతమైన ఇతర కారణాలవల్ల చలనంఉఒక్క స్వభావాన్ని మరిచెవేసే అవకాశము ఉంటుంది. కిందనుంచి పైకి (ఎత్తుకు) ఉండే చలనము- శక్తి, ప్రాధాన్యముకలదు. కాని ఆ చలనమున్న నటుడు- ప్రేక్షకులకు వెనుదిగిగి ఉన్నప్పుడు-ఆ చలనంతాలూకు శక్తీ, ప్రాధాన్యమూ రెండూ దెబ్బతింటాయి. ఇట్లాంటి విరుద్ధఫలితాలు ఎట్లా రూపొందుతాయో, ఎక్కువభాగము అనుభవంమీదనే తెలుస్తుంది. కాని శాస్త్రీయంగా, వివిధరకాలైన చలనాలూ, వాటిశక్తి తీవ్రతలూ తెలుసుకోవచ్చు.

ప్రాధ;అన్యము (Emphasis)

పాత్రయొక్క ప్రతి చలనమూ, ఆ పాత్రకు కొంత ప్రాధాన్యాన్ని తెచ్చిపెడుతుంది. చిన్న కదలికలకన్నా పెద్ద కదలికలు ఈ ఫలితాన్ని ఎక్కువగా సాధించగలవు. ఈ ఫలితాన్ని వైవిధ్యము మరింత తీవ్రతరము చెస్తుంది.

ఉ;దా:

1. ఉన్నస్థాసంకన్న ఎక్కువ ఎత్తుకు కదలిక.
2. కాంతి తక్కువగాఉన్న ప్రదేశంనుంచి కాంతి ఎక్కువవాఉన్న ప్రదేశానికి కదలిక.
3. రంగస్థలంమీద తక్కువ ప్రాముఖ్యంగల ప్రదేశంనుంచి, ఎక్కువ ప్రాముఖ్యంగల ప్రదేశానికి కదలిక. ఉదా: UL నుంచి DC కి.
4.భంగిమలో మార్పు
5. కోణంలో మార్పు (చూ.పటము 13.)

శక్తి (Strength)

ముందుకువెళ్ళే చలనము (aggressive) శక్తిని, వెనుతిరగడం (backward) శక్తిహీనతను సూచిస్తాయి. వంపుచలనాలు, సరాసరి చలనాల