పుట:RangastalaSastramu.djvu/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంగస్థల భూగోళము

రంగస్థల భూగోళము (Stage Geography)

అభినయానికి అనుకూలంగా దర్శకత్వంలో చేసే సూచనల నిమిత్తము అభినయావరణ భాగాలుగా విభజింపబడుతుంది. ఈ సూచనల ఆధారంతో ఈ విభజన ప్రాతిపదికమీదనే 'ప్రదర్శన ప్రతి ' తయారుచేయబడుతుంది. రంగస్థల మధ్యగా ఎగువనుంచి దిగువకు ఒక ఊహారేఖ గీసుకొంటే అది రంగస్థలాన్ని కుది ఎడమలుగా విభజిస్తుంది. దీన్ని మధ్యరేఖ (Centre line) అంటారు. అట్లాగే ప్రేక్షకులకు దగ్గరగా ఉండే భాగాన్ని దిగువ (Down) అనీ, దూరంగా ఉండే భాగాన్ని ఎదువ అనీ (Up) అంటారు. రంగస్థల విభజన కింది బొమ్మలో చూపబడింది.