పుట:RangastalaSastramu.djvu/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. ప్రేక్షకులమధ్య రంగస్థలము లేదా వృత్తరంగస్థలము (Arena Stage or Theatre-in-the Round)

ప్రేక్షకులు చుట్టూఉండి మధ్య ఉండే రంగషలము. ఇందువల్ల ప్రేక్షకులకు నటీనటులకుమధ్య సాన్నిహిత్యమెక్కువ అవుతుంది. ఈరకం రంగషలంమీదజరిగే ప్రయోగాలలో రంగసజీవకరణ, రంగాలంకరణ చాలా తక్కువగా ఉంటాయి. నటీనటుల ప్రవేశనిష్క్రమణాలు ప్రేక్షకులమధ్యనుంచే జరుగుతాయి. వారి కదలకలు సాంప్రదాయకంగా వస్తున్న పద్ధతిలోగాక అన్ని వైపులకు జరగవలె. రంగపరికరాలు తక్కువగా ఉండవలె. దీపనంకూడా విభిన్నంగాఉంటుంది.

రంగస్థలభాగాలు (Stage Parts)

ప్రేక్షకులు నాటకాన్ని చూసే ద్వారము రంగ ముఖద్వారమనీ, ఇది తప్ప తక్కిన మూడు పక్కల మూసి ఉంటుందనీ, నాటకము జరిగే ప్రదేశాన్ని రంగస్థలము (Stage) అంటారనీ, నటులు తిరుగాడుతూ కనిపించే భాగాన్ని

యావరణ (acting area) అంటారనీ, కనిపించని భాగాన్ని నేపధ్యము (Stage) అంటారనీ నటవిధ్యార్ధి తెలుసుకోవలె. దర్శకత్వంలోని సూచన ల కుడి ఎడమల ప్రస్తావన వచ్చినప్పుడు ఆవి నటుడు ప్రేక్షకాభిముఖంగా ఉన్నప్పుడు, ఆ నటునికి కుడి ఎడమలని (Stage left and right) గమనించవలె. రంగస్థలంమీది వివిధభాగాలు పైబొమ్మలో చూపించబడినవి.