Jump to content

పుట:RangastalaSastramu.djvu/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకం ఎన్నిక, నాటక విశ్లేషణము, అంతరార్ధవిశ్దీకరణ, సంరచన మొదలైన అంశాలన్నీ సంతృప్తికరంగా పూర్తిచేసిన తరవాట దర్శకుని బాధ్యత ప్రదర్శంప్రతి తయారుచేయటం. సంరచనా విధానాలు నిర్ణయమైన తరవాత నాటకానికి అనుకూలంగా రంగస్థలాలంకరణ రూపొందించవలె. ఆతరవాత ప్రవేశ నిష్క్రమణ ద్వారాలు స్థానాలు నిర్ణయించవలె. రంగస్థలంమీద ఉపయోగించే పరికరాలు (కుర్చీలు, బల్లలు వగైరా) -ఏవి ఏ దృశ్యంలో ఏయే స్థానాలలో ఉండవలెనో కాగితంమీద వివరించవలె. దీనిని గ్రౌండ్ ప్లాన్ (Ground Plan) అంటారు. ఇది స్కేలు ప్రకారము గీసుకోవటంవల్ల, వస్తువుకు, వస్తువుకు మధ్య ఎంతఖాళీ ఉండేదీ, నటునికి ఎంత అభినయావరణ పరిధి ఉండేది స్పష్టంగా తెలుస్తుంది. దీనిని బట్టి కదలికలు (movements), పాత్రసమ్మేళనము రూపొందించటం వీలవుతుంది. రంగస్థలంమీద పనిచేసే సాంకేతిక సహాయకులకు వీలుగా ఉండేనిమిత్తము ఈ ప్లాన్ పెద్దదిగా ఉండవలె. అంతేగాక అన్ని వివరాలు గుర్తుపెట్టుకొనే సౌలభ్యం దృష్ట్యాకూడా ఈ ప్లాన్ ఎంత పెద్దదిగా ఉంటే అంతమంచిది. దీనికి స్కేలు -అడుగుకు అంగుళంగాని, రంగస్థలము చిన్నదైతే అడుకుకు అర అంగుళంగాని పెట్టుకోవచ్చు. అవసరాన్నిబట్టి చిన్నప్లాన్లు తయారుచేసి రంగ నిర్వాహకునికి, (Stage Manager) అతని సహాయకులకు ఇవ్వవచ్చు.

ఈవిధంగా గ్రౌండ్ ప్లాన్ తయారుచేసేటప్పుడు, దర్శకుడు తాను చేసిన దృశ్య సంరచన, రంగ కార్యకలాపాలు, నటీనటుల ప్రవేశ నిష్క్రమణాలు, ఇతర-స్థల నిర్దేశాలు, రంగసజ్జ విభిన్నస్థానాలలో ఉన్న ప్రేఖకులందగికీ కనిపించేటట్లు జాగ్రత్తపడవలె. ప్రేక్షకుల దృష్టికి అగుపడకుండా ఉండవలసినె వాటిని మరుగు పరచుకోవలె. దీనికి వివిధ ప్రేక్షక స్థానాలనుంచి