రచయిత ఈ విషయంలో ప్రతిభ చూపనప్పుడు, దర్శకుడు తన ఊహాశక్తిని వినియోగించి కొత్తప్రయోగమార్గాలద్వారా ప్రేక్షకకుతూహలాన్ని రేకెత్తించవలె.
1. ప్రధాన పరాకాష్టను వీలైనంతగా నాటకం చివరకు తీసుకొనిరావలె. ప్రధాన పరాకాష్ఠ9main climax) తరవాత దీర్ఘ సంభాషణలు (lengthy dialogues) వీలైనంతవరకు తగ్గించవలె.
ప్రయోగ సమస్యలు (Production Problems)
ప్రతి నాటకప్రయోగంలోను నాటక-అంతరార్ధ విశదీకరణము (Play Interpretation) మొదలు ఒక ప్రత్యేక సంభాషణ, ఉచ్చారణ స్థాయి మొదలైన అనేక-అంశాలదాకా దర్శకుడు వందలకొద్దీ సమస్యలు పరిష్కరించవలసి వస్తుంది. కాబట్టి, దర్శకుడు సమస్యలను వాటివాటి ప్రాధాన్యక్రమాన్ని నిర్ణయించి, ఆ క్రమం ప్రకారము పరిష్కరించవలె. అట్లా చేయకపోతే ప్రదర్శన నాటికి, ముఖ్యసమస్యలు కొన్ని పరిష్కరిమపబడకుండా, సమస్యలుగానే నిలిచిపోయే ప్రమాదమేర్పడుతుంది. సమస్యయొక్క ప్రాముఖ్యము, దానిని పరిష్కతించడంలో ఉండే ఇబ్బంది ఎక్కువ తక్కువలవల్ల గాక, ప్రదర్శన సాఫీ నడవదు ఎదురయ్యే అవరోధాలనుబట్టి నిర్ణయించవలసి ఉంటుంది. దర్శకుడు సమస్యలనుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించకూడదు. బాగా నడుస్తున్న దృశ్యానికి మెరుగులు దిద్దటంకన్న బాగా నడవని దృశ్యంపట్ల శ్రద్ధ చూపటం ఎక్కువ ఆవసరము.