పుట:RangastalaSastramu.djvu/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రయోగ ప్రధానోద్దేశము, ప్రేక్షకావధానము-అనురక్తి

తుంది. ప్రేక్షకానురక్తినీ, కుతూహలాన్నీ, అవధానాన్నీ ముఖ్య సన్నివేశ భాగాలలో సాధించవలెనంటే, దర్శకుడు ఎంతో ముందు జాగ్రత్త తీసుకొని, హెచ్చరికతో, మోతాదుగా సరియైన కాలంలో పైనచెప్పిన ప్రయోగాలను వినియోగించవలెనేగాని దుబారా చేయరాదు.

దర్శకుడు ప్రధాన పరాకాష్ఠ సన్నివేశాన్ని, ఇతర పరాకాష్ఠ సన్నివేశాలను ముందుగా గుర్తుపెట్టుకొని ప్రదర్శనప్రతిలో వ్రాసుకొని వాని సక్రమ నిర్మాణము ఎక్కడ ప్రారంభము కావలెనో, ఎట్లా పరిణామము చెందవలెనో, ఎక్కడ శిఖరాగ్రాన్ని అందుకోవలెనో, ఎక్కడనుంచి దిగిపోవలెనో, స్పష్టంగా నిర్ణయించుకొని, ఆచరణలో పెట్టవలె. ఇందుకు అవసరమైన కరలికలు, కార్యకలాపము, దృశ్య సమీకరణ, సంఖ్యాభాషణస్థాయి, వైవిధ్యము, ఉద్వేగపరకటన మొదలైనవి రూపొందించుకోవలె.

ప్రేక్షకులుకూడా రాబోయే పరాకాష్ఠసన్నివేశాన్ని, పసిగట్టే శక్తి కలిగివుండి, దానికి సంసిధ్దులై ముందుకు సాగుతారు. కాబట్టి, ఆపరాకాష్ఠ ప్రేక్షకులు మామూలుగా ఊహించేటప్పుడు గాక, మరికొంత తరవాత ఏర్పడితే, వారిని ఆశ్చర్యచకిగులనుజేసి, ప్రదర్శనను మరింత రక్తికట్టించవచ్చు. ఈ ప్రప్రయత్నము చేయడం దర్శకునికి ఎంతో అవసరము. అయితే, పరాకాష్ఠ అందుకోవడంలో ఈ విధంగా అయ్యేజాగు ప్రేక్షకులూహించని చిన్నచిన్న పరాకాష్ఠ లకు దారితీయడం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి దృశ్యం నిడివిమీదా నాటక స్వభావంమీదా ఆధారపడి ఉంటాయి.

ప్రేక్షకానురక్తి తరంగాలు ఒక నాటకానికీ మరొక నాటకానికీ ఒకే విధంగా ఉండవుకదా! ప్రేక్షకానురక్తి సక్రమంగా రూపొందించడానికి దర్శకుడు కింది సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.

1 నాటకము ప్రారంభించిన తరవాత, మొదటి ఐదునిమిషాలు ప్రేక్షకానురక్తికి ప్రత్యేకప్రయత్న మనవసరము.

2. అనురక్తి తరంగానికీ అనురక్తి తరంగానికీ మధ్య ఉండే కాల వ్యవధి తేడాగా ఉండవలె.

3. తెర పడేముందు ప్రేక్షకానురక్తి సక్రమంగా నిర్మాణము పొందే టందుకు, కుతూహల మెక్కువగా ఉండేటట్లు దర్శకుడు శ్రద్ధ వహించవలె.