పుట:RangastalaSastramu.djvu/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రేక్షకానురక్తి

సాదించే సన్నివేశాలు ప్రేక్షకులకు ఎక్కువ తృప్తినీ, ఆనందాన్నీ ఇస్తాయి. దర్శకుడు ఇట్లాంటి కుతూహల తరంగాలు సృష్టించే సందర్భంలో కురూహల సృష్టిభాగ మెక్కువగా ఉండేటట్లు జగ్రత్త పడవలె. తరంగాభివృద్ధి ఎంత ఆకస్మికంగా జరిగితే అంత చక్కగా రక్తికడుతుంది.

ఈ ప్రేక్షకానురక్తిని ప్రదర్శనలో రూపొందించేటప్పుడు దర్శకుడు కింది విషయాలు గమనించవలె.

1. ముఖ్య పరాకాష్ట (Main climax) సన్నివేశానికి స్థాయి ఒక్కొక్క నాటకానికి భిన్నంగా ఉండుంది. విషాదాంత నాటకాలలో దీని అవసరము ఉండరు.

2. ప్రతి దృశ్యంలోని పరాకాష్ట సన్నివేశంయొక్క శిఖరగ్రత దాని పూర్వపు దృశ్యంలో దానికన్న ఎక్కువగా ఉండవలెనేగాని తగ్గరాదు. అట్లా తగ్గితే ప్రదర్శన రక్తికట్టదు.

3. ఎక్కువ వ్యవధిగల కౌతుక-అవరోహణలు (long rises in interest curves) ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. అంతేకాదు, ముఖ్య సన్నివేశాలతో అనవసరంగా ప్రేక్షకులకు హాస్యధోరణి కన్పిస్తుంది. అట్లాంటి ప్రమాదము తప్పించవలెనంటే అందుకు తగినది అవరోహణ (fall) ; ఇది ఎంత ఆకస్మికంగా జరిగితే ప్రేక్షకానురక్తి అంతగా పెరుగుతుంది. కాని ఈ పద్ధతి అతిగా ఉపయేగిస్తే పాతబడి అనుకొన్న ఫలితము సాధింపబడదు.

4. కుతూహల నిర్మాణమగిపోవటంతో ప్రేక్షకానురక్తి దానివెంటనే తగ్గుతుంది. దృశ్యము పరాకాష్ఠను (climax) అందుకోకముందే, కొతూహల నిర్మాణము (suspense build) ఆగిపోతే, పరాకాష్ఠ అందుకోకముందే, కుతూహల నిర్మాణంఉ (suspense build) ఆగిపోతే, పరాకాష్ఠ అందుకొనే అవకాశము పోయి, సన్నివేశము దిగజారి, ప్రేక్షకానురక్తి లోపించి, రసాభాస మవుతింది.

ఉదా: 1. ముఖ్య సన్నివేశాలకు పొదుపుగా వాడుకోవలసిన కింది మధ్య (D.C.) అభినయావరణను ముందు ప్రాముఖ్యంలేని సన్నివేశాలకు అనవసరంగా వాడుకోవటంవల్ల ఇట్లాంటి ఇబ్బంది కలుగుతుంది.

2. దీర్ఘ సంభాషణ మొదటిభాగంలోనే గమనవేగంలోనూ, ఉచ్చారణలోనూ వైవిధ్యాన్ని కార్యకలాప ప్రక్రియలను పూర్తిగా వినియోగిస్తే ముఖ్యభాగాలలో ప్రేక్షకానురక్తిని పూర్తిగా కోల్పోయే ప్రమాదము ఏర్పడు