పుట:RangastalaSastramu.djvu/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. వివాద కరణ పాత్ర (Subject of Controversy)

4. ఉపయోగ పాత్ర (Utility Character): ముఖ్యకధా విధానానికి సంబంధము లేకపోయినా నాటక గమనానికి తోడ్పడే పాత్ర.

ఉదా|| సేవకుడు (తలుపులు తియ్యటం, వెయ్యటం, టెలిఫోను అత్తటం మొదలైనవి చేస్తాడు)

5. రెయ్ షన్ (Rassionur): రచయిత భావాలను ప్రత్యేకంగా వెల్లడించే పాత్ర.

6. విశ్వాసపాత్రుడు (Confidant): ఆధునిక నాటకాలలో ఎక్కువ భావాలు పాత్రలద్వారా, ఒక ప్రత్యేక పాత్రనుద్దేశించి చెప్పబడతాయి-అట్టిపాత్ర.

7. ప్రాతినిధ్య పాత్ర (Character representing Groups or Forces): ఒక సమూహానికి లేదా ఉద్యమానికి ప్రాతినిద్యము వహించేపాత్ర.

8. ప్రత్యేక పాత్ర (Character serving Special Values) ప్రత్యేకమైన నాటకీయపు విలువ్లకు ఉపకరించే పాత్రలు. ఉదా|| హాస్యపాత్ర.

సానుభూతి (Sympathy)

'సానుభూతి ' అనేది ఒక ప్రత్యేక ప్రయోగంలో నాటకమ్లోని ఒక పాత్రపైన ప్రేక్షకులకు కలిగే ఇష్టమ్మీద, కుతూహలం మీద ఆదారపడి ఉంటుంది. ఈ ప్రేక్షక నాసుభూతి అన్ని పాత్రలపట్లా సమానంగా ప్రసరింఛే టట్లు దర్శకుడు జాగ్రత్త పడవలె. సమపాళ్ళలొ పాత్రోచితంగా ఇది జరిగినప్పుడు, దానితోబాటు ప్రదర్శన జరుగుతున్నప్పుడు ప్రతి కొద్ది క్షణాలకూ, పాత్రనుండి పాత్రకు మారుతున్నప్పుడు, ప్రదర్శన విజయవంత మవుతుంది. పాత్రల స్వబాచ్వ ప్రకృతులలోని ఉత్తమ లక్షణాలను ప్రస్పుటీకరించటం ద్వారా గాని అవసరమైనప్పుడు కొన్నింటిని పాత్రనుబట్టి చేర్చడంద్వారాగాని. ఆ లక్షణాలను బహిర్గతము చేసే రంగ కార్యకలాపాలు (stage business) ఆ పాత్రకు కల్పించటంద్వారా గాని, పాత్రమీది సానుభూతిని ఎక్కువ చేయవచ్చు. ఈ పద్దతులు విరుద్దంగా ప్రయోగిస్తే సానుభూతిని కలిగించటానికి దానిని హస్య ధోరణిలొ చిత్రీకరించటం మరొక పద్దతి. ఒక పాత్రకు కొన్ని దుష్టలక్షణాలున్నా హాస్యధోరణి కలిగిఉంటె సానుభూతి ఎక్కువ అవుతుంది. నవ్వించే వ్యక్తిపట్ల సానుభూతి మానవ సహజ