పుట:RangastalaSastramu.djvu/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లక్షణము. ఒక్కొక్కప్పుడు ఈ పద్ధతి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఉదాత్త లక్షణాలుగల నాయకపాత్ర పక్కన హాస్యధోరణిగల దుష్టపాత్ర ఉంటే నాయక పాత్రమెద ఉండవ్లసినదానికన్న సానుభూతి తగ్గిపొయే ప్రమాదము ఉంటుందని దర్శకుడు మరువరాదు. ఆ యా సందర్బాలలో హాస్యధోరణి తగ్గించవలె.

పాత్ర చిత్రణము (Characterisation)

పాత్రయొక్క ప్రయోజనము, సానుభూతి ప్రాముఖ్యము నిర్ణయిచిన తరవత ఆ పాత్ర విశ్లేషణ చేయవచ్చు. దీనికి ఒక ముఖ్య సూత్రము దర్శకుడు మనస్సులో ఉంచుకోవలె. "అకారణంగా ఏపాత్రనూ చెడుగా చిత్రీకరించరాదు" ఈ సూత్ర మత్యంత ప్రాముఖ్యము గలిగినది. ఈ సూత్రానికి ఏవిధమైన మినహాయింపులు లేవు. 'పిరికితనము, లోభిత్వము, అజ్ఞానము, క్రూరత్వము ' మొదలైనవి 'చెడు ' కి కొన్ని ఉదాహరణలు. ఈ లక్షణాలు తగినంత కారణం లేకుండా ఏ పాత్రకూ ఆపాదించరాదు. కధా సంవిధానానికి ప్రత్యేకంగా అవసరమైతే తప్ప, పాత్రలకు దుష్టలక్షణాలు అనవసరము. ఈ స,దర్బంలో మరో ముఖ్య విషయము తెలుసుకోవలసి ఉంటుంది. పాత్ర 'చెడు ' గా ఉండటానికి, 'మంచి 'గా ఉండటానికి వనక చెప్పిన 'ప్రేక్షక సానుభూతి 'కి ఎట్టి సంబంధములేదు. 'చెడు ' పాత్రలై నంతమాత్రాన ప్రేక్షకులకు సానుభూతి లేకపోవటం జరగదు. మామూలు వాడుకలోఉండె 'సానుభూతి 'కి నాటకీయమైన 'ప్రేక్షక సానుభూతి 'కీ ఇదే తేడా.

దర్శకుడు తీసుకోవలసిన శ్రద్ధలలో మరొక అంశము; నాయికాపాత్ర పక్కన ఉండే స్త్రీ పాత్రలకు, నాయకపాత్ర పక్కన ఉండే పురుష పాత్రలకు, ఆ నాయికా నాయక పాత్రలకంటె అధికంగా ప్రాధాన్యము ఇచ్చి రూపొందించటం- ప్రధానపాత్రలకు దెబ్బ అనే విషయము గమనించి, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం.

ప్రధాన పాత్రలన్నీ చైతన్యవంతంగా రూపొందించవలె. అంటే అవి మార్పుకు అనుకూలంగా ఉండి, నాటకంతోపాటు పాత్రోచితంగా పరిణామము చెందవలెనే గాని, స్తబ్ధంగా ఉండరాదు. ఉదా|| నాయకపాత్ర ఉత్తమలక్షణాలు కలిగినప్పటికీ పరిస్థితుల బలహీతకు లోనై దిగజారటం, తిరిగి ఆత్మ