Jump to content

పుట:RangastalaSastramu.djvu/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రల అంతర్గతార్ద విశదీకరణము

సంగతులు తెలియజెప్పేవీ (narrative sequences), ప్రేమ సన్నివేశాలు (love sequences) మొదలైనవి.

3. వాతావరణ సన్నివేశాలు (Back-ground Sequences)

కధాగమనానికి, సంఘర్షణకుగాక కేవలము నాటకకధా వాతావరణ సృష్టికి ఉపయోగింఛేవి.

4. పరిణామ సన్నివేశాలు (Transition Sequences)

కధాసంవిధానంతో పాత్రల ప్రవేశ నిష్క్రమణలకు, కొత్త అంశాలను ప్రవేశపెట్టడానికి ఉపయోగించేవి.

5. విరామ సన్నివేశాలు (Relief Sequences)

ఉద్వేగాలు (emotions) పరాకాష్ఠ నందుకొన్న తరవాత మానసికంగా విరామముకల్పించడానికి ఉపయోగించేవి.

పాత్రల అంతరార్ధ విశదీకరణము (Character Interpretation)

నాటకప్రయోగంలో పాత్రలను వాటివ్యక్తిగత ప్రాధాన్యాన్నిబట్టి గాక నాటకాన్ని స్థూలంగా దృష్టిలో ఉంచుకొని, వాటిఅంతరార్ధాన్నిబట్టి ప్రతి పాత్రకు ఒక ప్రధానప్రయోజనము (function) ఉంటుంది. ఈ ప్రధాన ప్రయోజనాన్ని పరిశీలించి అర్ధముచేసుకోవడం ఆపాత్ర అంతరార్ధవిశదీకరణానికి మొదటిమెట్టు. నాటకాలలో కనిపించేపాత్రలు సాదారణంగా కింది స్వభావ ప్రయోజనాలు కలిగిఉంటాయి.

1. కధాసారధి (నాయకపాత్ర - Protagonist) : నాటకకధనానికి అధరభూతమైన ముఖ్యపాత్ర, ఒక్కొక్క నాటకంలో ఇట్లాంటి ముఖ్య పాత్రలు రెండు ఉండడంకూడా సంభవమే. ఇవి నాయికా నాయక పాత్రలు కావచ్చు. నాటకంలో సమానప్రాముఖ్య్హంగల అనేక పాత్రలు ఉండడం అరుదు. ఇట్లాంటి ముఖ్యపాత్రలకు ఎక్కువ సంభాషణ లుండడం పరిపాటి. కాని ఎక్కువ సంభాషణలున్న ప్రతిపాత్ర కధాసారధి (నాయిక లేదా నాయక) పాత్ర కాజాలదు.

2.కధాప్రతిసారధి (Antagonist): కధాసారధి పాత్రకు విరుద్ధపాత్ర.