Jump to content

పుట:RangastalaSastramu.djvu/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక సామగ్రి సక్రమంగా వినియోగించినట్లయితే అవి విలువలుగా మారి, ప్రేక్షకులకు అందుతాయి. వైజ్ఞానికమైన విలువలు (intellectual values) ప్రేక్షకులకు నిర్ధుష్టంగానూ సరళంగానూ అందించినప్పుడే అవి వారికి ఆనందదాయకాలవుతాయి. భావోద్వేగాలకు సంబందించిన విలువలు ప్రేక్షకులకు అర్ధము కావలసిన అవసరంలేదు. ఒక నాటకానికి వనక ఉన్న అంతర్గతభావము దాని నైతిక మైన విలువ (moral values) అని చెప్పవద్దు. "సత్యమే జయిస్తుంది" అన్నది ఒక నీతి. ఇదే ప్రశ్నార్ధకంగా "సత్యము జయిస్తుందా" అనికూడా ఉండవచ్చు.

నాటకంలోని ఇతర భావాలు

పాత్రల స్వభావ స్వరూపాలు, వాటి పరిశీలన, ఫలానా ప్రకృతి8గల వ్యక్తి ఫలానా పరిస్థితులలో తన స్వభావాన్ని ఎట్లా ప్రకటిస్తారు ఎట్లా చరిస్తాడు మొదలైనవి. నాటకంలో ఉండే ఈ రకమైన భావాలు అతిపరిచిరాలూ, సర్వసామాన్యాలూఅయినా, ఆశాభంగము చెందనక్కరలేదు. వీటిలొ కొత్తదనము మామూలుగా ఉండదు. కాకపోతే, వాటిని చెప్పే విధానంలోనె రచయిత కొత్తదనము చూపవద్దు. నాటకంలో నైతికమైన విలువలు మాత్రమే గాక బోధనాత్మకమైన విలువలు (educational values) కూడా ఉండవచ్చు.

ఉద్వేగాత్మకమైన విలువలు (Emotional values)

1.అనేక నాటకాలలోని ముఖ్యపాత్రల అనుభవాలతో ప్రేక్షకులు ఊహలో పాలు పంచుకొని పరానుభూతి (empathy) పొందుతారు. దీనివల్ల వారికీ ఒక విధమైన ఉద్వేగానుభవము కలుగుతుంది. నాటక ప్రదర్శనయొక్క ముఖ్యాకర్షణే ఇది.

2. పైవిధంగా కాక ప్రేక్షకులు పాత్రనుంచి విడిపడి ప్రదర్శన చూసినప్పుడు కూడా వారికి ఉద్వేఅనుభవము కలుగుతుంది. ఉదాహరణకు హాస్యసంభాషణ చెప్పిన పాత్రతోపాటుగా తాదాత్మ్యము చెందటంగాక, ఆ సంభాషణకు గురియైన పాత్రవంక చూసి, ప్రేక్షకులు నవ్వుతారనేది గమనించదగిన విషయము.

కళాత్మకమైన విలువలు (Artistic Values)

1.కంటితో చూసే సుందర వస్తువులు, ఆకర్షకమయిన ఇతర దృశ్యాలు.