పుట:RangastalaSastramu.djvu/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. చెవితో వినే కవిత్రము చక్కని కంఠస్వరము, సంగీతము, లయబద్ధము శ్రావ్యము అయిన శబ్ధాల ద్వారా ప్రేక్షకానుభూతికి అందించబడతాయి.

ముఖ్యభావము (Theme)

ఒక నాటకంలో వ్యక్తమయ్యే వివిధభావలతో నాటకకధకు ప్రాతిపదికగా ఉండే భావము ఆ నాటకంలోని ముఖ్యభావము. ఈ ముఖ్యభావ ప్రకటనకు అనుకూలంగా దర్శకుడు నాటక ప్రదర్శన రూపొందించవలె. అట్లాగని ముఖ్యభావము మాత్రమే దృష్టిలొ ఉంచుకొని ప్రదర్శన సాగినంతమాత్రాన చాలదు. ఇతరభావాలుకూడా విస్మరించరానివి. ముఖ్యభావానికి ప్రాముఖ్యమివ్వడం మాత్రము ప్రధానము.

ప్రదర్శన పద్ధతి (Treatment)

ప్రదర్శన దృష్ట్యా, ముఖ్యభావ వివరణ మాత్రమే నాటకాన్ని నిలబెట్టలేక పోవచ్చు. అట్లాంటి పరిస్థితులలో దానికి విశేష ప్రాముఖ్యమివ్వనక్కరలేదు. నాటకంలోని అన్ని విలువలూ ప్రాముఖ్యము వహించినప్పుడు ప్రదర్శన జయప్రద మౌతుంది. సత్య హరిశ్చంద్ర నాటకంలో "సత్యమేవ జయతే" అనేది ముఖ్యభావమైనా, నాటకంలోని ప్రాముఖ్యమంతా హరిశ్చంద్రుని కష్టాలు చిత్ర్రీకతించడంలోనే ఉంటుంది. ఇది నాటక శిల్పంలో అవసరమైన ప్రక్తియ.

ప్రాముఖ్య మివ్వవలసిన విలువలకు సరియైన స్థానము కల్పించడం, అవి సక్తమంగా ప్రేక్షకులకు అందించడానికి మార్గాలు అవ్వేషించి, నిర్ణయించి, ఆదరణలో పెట్టడం- ఇది ప్రదర్శన పద్ధతి (treatment), నాటక ప్రయోగ కార్యక్రమంలో ఇది అతిముఖ్యమైన అంశము.

పలురకాలైన విలువలు ప్రతి నాటకంలోను ఉంటాయి. అవి అన్వేషించి ఆచరణలో పెట్టడం దర్శకుని బాధ్యత.

ఒక నాటకంయొక్క విశిష్ట లక్షణము రచయిత మాటలలోనే గాక అది చూచేటప్పుడు ప్రేక్షకులకు ఏర్పడే దృక్పధం (view point) మీద కూడ ఆధారపడి ఉంటుంది. తెర ఎత్తేదాకా ప్రేక్షకుడు ఏ దృక్పదంలో నాటకం చూస్తూడో ఊహించడం కష్టము. తెర ఎత్తిన తరవాత కొద్దిసేపటికి ప్రేక్షకినికి మానసికంగా ఒక దృశ్యము స్థిరపడుతుంది. అట్లా స్థిరపడిన దృక్పధంతోనే నాటకాన్ని చూస్తాడు. నాటకంలో తాను చూసే ప్రతిదీ తాను స్థిరపరచుకొన్న