పుట:RangastalaSastramu.djvu/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది




అంతరార్ధ విశదీకరణము (Interpretation)

పూర్వపురోజులలో నటీనటులు తాము ధరించవలసిన పాత్రల స్వరూపస్వభావాలు ఎట్లా ఉండవలెనో తామే ఊహించుకొని నిర్ణయించుకొనేవారు. దీనినే నాటకీయ పరిభాషలో "అంతరార్ ధవిశదీకరణము" అంటారు. పాత్రల అంతరార్ధ విశదీకరణ నాటక-అంతరార్ధ విశదీనకరణాన్నిబట్టి ఉంటుంది. నాటక అంతరార్ధ విశదీకరణము, నాటక విశ్లేషణము ఒకదానికొకటి సంబంధించినవి కావడంవల్ల, ఆధునిక నాటకరంగంలో ఈ బాధ్యత దర్శకుడే వహించి, నటీనటులకు తెలియజెప్పి, ఏ పాత్ర అంతరార్ధాన్ని ఆ పాత్రే విశదీకరించుకొనే పద్ధతికి స్వస్తిచెప్పడం జరిగింది. కేవలము వివరాలుమాత్రమే నటీనటులకు వదలిపట్టబడతాయి.

ఒక నాటకము చదివి విశ్లేషణము చేసేటప్పుడు అందులోని నాటక మామగ్రిని (dramatic material) అంటే - సంభాషణలు, పాత్రలు, దృశ్య వివరాలు, భావాలు, కార్యకలాపము మొదలైనవన్నీ-పరిశీలించి విలువలు (values) కట్టవలె. ఈనాటకీయమైన విలువలే (dramatic values) ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించేవి, ప్రదర్శింపబడే నాటకము ప్రేక్షకుల ఉద్వేగాలకు పని కల్పించి, సందర్భాన్ని బట్టి, వారిని హాస్యంలోనో, విషాదంలోనో ముంచెత్తుతుంది. వైజ్ఞానికమైన కొత్తకొత్త భావాలను ప్రేక్షకులకు ఆకర్షణీయంగా అందిస్తుంది. కధలోని భవాలను మరింత పటిష్టంగానూ ఆకర్షణీయంగానూ ఆసక్తి కరంగానూ ప్రేక్షకులకు ప్రదర్శిస్తుంది. నాటకంలొ అంతర్గతంగా ఉండే భావాలు ప్రదర్శనలో రసవత్తరంగా ఉద్బుద్ధమై విలువలుగా రూపొందుతాయి; అప్పుడు వాటిని భవాత్మకమైన విలువలు (phylosophical values) అనవచ్చు. నాటక కధావస్తువు వల్ల, శిల్పం (technique) వల్ల, ఆహార్యము మొదలైన విశేషాలవల్ల నాటకీయమైన విలువలు (dramatic values) రూపొందుతవి.