అందుబాటులోఉన్న నటీనటుల సమాజంలో ఎన్నుకొన్న నాటకాన్ని ప్రదర్శించడం సాధ్యమా ప్రయోగము చాలాదూరముసాగే వరకు ఈ ప్రశంకు నిర్ధిష్టమైన సమాధానము అస్పష్టంగా ఉండేమాట నిజమేఅయినా, నాటకంలోని ప్రతి పాత్రకు సమర్ధుడైన నటుడు లభించనప్పుడు, వెదకడం సరిపెట్టుకోక తప్పదనీ -- ఆ కారణంచేత ప్రయోగముకష్టమనీ, ప్రదర్శన విజయము పొందడం సందేహాస్పదమనీ చెప్పకతప్పదు. ఏపాత్రకు సరిఅయిన నటుడు లేకపోయినా ఈ అపజయము తప్పదు.
3. ఎన్నుకొన్ననబడిన నాటకము సమాజముయొక్క ఆర్ధికాది శక్తి సామర్ధ్యాలకు మించినదా
పెద్దేత్తున రంగలంకరణ (decor) దృశ్యబంధ నిర్మాణము (set construction) మొదలైన వాటితో నాటకప్రదర్శన రూపొందించడం ఎంతో ఖర్చుతోకూడినపని. అట్లాగే నంగీతము, నృత్యము మొదలైన హంగులు దృశ్యానికీ దృశ్యానికీ మార్పులు (ఆ మార్పులు తక్కువ వ్యవధిలో చేయవలసిన అవసరము) సాంకేతికల్మైన విలువలు--ప్రత్యేక రంగదీపనము (special stage lighting) మొదలైన వానితోకూడిన నాటక ప్రదర్శన సాధారణ నాట్కసమాజాల శక్తి సామర్ధ్యాలకు మించినది. అంతేగాక ప్రదర్శనజరిగే నాటశాలకూడా ఈ ప్రయోగాలన్నింటికి అనుకూలంగా ఉండవలె. ఇట్లా అన్ని అంశాలు సంతృప్తి కరంగా లేనప్పుడు-నాటకం ఎన్నికవిషయము పున: పరి:శీలన చేసుకొని, ఖచ్చితమైన నిర్ణయానికి రావలె. వరసగా నాటకాలు ప్రదర్శించే ప్రణాళికన్నప్పుడు, వాటి క్రమంలో వైవిధ్య ప్రకృతలుగలవి, ఒకదాని తరవాత ఒకటి ఏర్పాటు చేసుమోవలెనేగాని, ఒకేతరహా నాటకాలు - ఇతివృత్తంలోగాని, ప్రదర్శనశైలిలోగాని, రంగాలంకరణంలోగాని - ఉండరాదు.
చాలామంది యువదర్శకులు విషాతాంత నాటకాలు, సమస్యా పరిష్కారంలేకుండా ప్రేక్షకుల ఊహకు వదిలేసే నాటకాలు మాత్రమే ఉత్తమ కళాస్వరూపాలనే భావముకలిగి, ఉండడం ఒక్కొక్కప్పుడు చూస్తున్నాము. కాని ఈ రెండు లక్షణాలు మాత్రమే ఉత్తమ నాటకానికి నిర్ణాయకాలు కానేరవు. ఈ ముగింపు ప్రేక్షకులకు తృపినిచ్చేవికావలె. ప్రేక్షకులకు తృప్తినివ్వడంతో పాటు, వారి ఊహాశక్తికి పదుపెట్టడం, ఇంద్రియాలను ఉత్తేజపరచడం, మనో