పుట:RangastalaSastramu.djvu/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రలేదు. కాని, ఈ జవాబులన్నింటి సారాంశముతేల్చి, వాటిని తరగతుల వారీగా విభజిస్తే మూడు ముఖ్యకారణాలు కనిపిస్తాయి.

   1. వికర్షణ 2. ఉద్దీపనము 3. మనోదీవనము
(DIVERSION) (STIMULATION) (ILLUMINATION)

ప్రతిప్రేక్షక సమూహంలోనూ, ఈ మూడు కారణాలచేత వచ్చే జనము విభిన్న సంఖ్యాబలాలతో ఉంటారు. ఈ ఎక్కువ తక్కువలు ప్రదర్శనజరిగే ప్రదేశాన్నిబట్టి, ఇతర పరిస్థితులనుబట్టి ఉంటాయి. నేర్పుగల దర్శకుడు ఎక్కువ మంది ప్రేక్షకులు మెచ్చే, ఆనందించే నాటకాన్ని ఎన్నికచేసుకుంటాడు. నాటకనిర్ణయము, అది ప్రదర్శింపబడే ప్రదే శంలోని ఎక్కువమంది ప్రేక్షకుల అభిరుచి ప్రకారము జరిగితే, అది వారి ఆదరణపొంది విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతేగాక, ప్రదర్శింపబోయే నాటకంపట్ల--దాన్ని ప్రదర్శించే దర్శకుడు, సమాజసభ్యులు, ముఖ్యంగా నటీనటులు ఉత్సాహపూరితులు కావలె. వారికి ఇష్టంకాని నాటకప్రదర్శన ఎట్టి పరిస్థితులలోనూ విజయవంతముకానేరదు. అంతమాత్రంచేత నటీనటులుగాని, దర్శకుడుగాని, వారి వ్యక్తిగత ప్రతిభా విశేషాలను ప్రకటించుకోవడంకూడా సరిఅయిన పద్దతికాదు. అది ప్రేక్షకులు కూడ చూసి ఆనందించగల ఆకాశము కలిగినదికావలె. అందుచేత, ప్రేక్షకాబిరుచులకు అనుగుణంగా స్థాయి దిగజారడంగాని, వారికి అందని ఉన్నత ప్రమాణాలుగల పైస్థాయిలో ఉండడంగాని పొరపాటే అవుతుంది.

ఎంచుకోబోయే నాటకము ఇటు సమాజసభ్యుల, అటు ప్రేక్షకుల అభిరుచులకు అనుకూలమైనదనే నిర్ణయానికి వచ్చినప్పుడు, కింది ప్రశ్నలను నిర్వాహకులు సరియైన జవాబు చూసుకొని మరీ నాటకనిర్ణయము స్థిరపరుచుకోవలె. ఎన్నుకొన్న నాటకాన్ని సమాజదర్శకుడు సక్రమంగా ప్రదర్శింప చేయగలడా. ఎన్నుకొన్న నాటక కధావస్తువుపైగాని, రచయిత భావాలపైగాని, దర్శకునకు హృదయ పూర్వకంగా ఉత్సాహవంతంగా కృషిచేసి, ఆ నాటకాన్ని రసవత్తరంగా ప్రదర్శింపజేయడం అసంభవము. ఆట్టి సందర్భాలలో నాటకాన్ని మార్చుకోవడం అత్యవసర మవుతుంది.