పుట:RangastalaSastramu.djvu/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక ప్రయోగంలో, నాటక నిర్ణయమే పునాదివంటిది. ఏదో ఒక నాటకము ప్రదర్శించవలెననే ఉత్సాహంతో కొంతమంది నటీనటులు ఒక సమాజాన్నిస్థాపించుకొంటారు. వారికి ఎదురయ్యే ప్రశ్నలనేకము;.

'ఎట్లాంటి నాటకము ' 'ఏనాటము ' 'పౌరాణికామా ' చారిత్రకమా, సాంఘికమా, హాస్యప్రధానమా రాజకీయమా ప్రబోదాత్మకమా, గద్య, పద్యాత్మకమాఅ స్త్రీ పాత్ర లున్నదా, లేనిదా '

ఈ ప్రశ్నల వెనువెంటనే 'ప్రదర్శించడం ఎందుకు ' ఎవరికోసము ' అనే ప్రశ్నలు, 'ఈ ప్రదర్శనకు అవసరమయ్యే ఆర్ధికస్తొమత సమాజానికి ఉన్నదా ' మొదలైన ప్రశ్నలు కూడా ఒకదానివెంట ఒకటి దూసుకొనివస్తాయి. ఈ ప్రశ్నలను జాగ్రత్తగా పరిశీలించి, ఒక నిర్ణయానికి రావడంమీద నాటకనిర్ణయము ఆధారపడి ఉంటుంది.

మొదటి ప్రశ్న 'ఎందుకు .' 'సమాజసభ్యుల సరదా తీరడానికా ' 'ఏదైనా ఒక సమస్య ప్రజలముందుంచడానికా,' "కేవలము నాటక పోటీలలో పాల్గొనడానికా," "వార్షికోత్సవ కార్యక్రమానికా" "రాజకీయ ప్రచారానికా" ఇటువంటి ప్రశ్నలకు జవాబులు చూసుకొని ఒక నిర్ణయానికి రావలసిఉంటుంది. రెండవప్రశ్న: "ఎవరికోసము" అనేది. ముఖ్యంగా నాటక ప్రదర్శన ప్రేక్షకుల కోసమే అనే విషయము నిర్వివాదాంశమే. అయితే నాటక ప్రదర్శనకు ప్రేక్షకులకు ఉండే సంబంధము కొంచెము పరిశీలించవలసి ఉన్నది. ప్రేక్షకులందరూ ఒకే అభిరుచి గలవారై ఉండరు. పట్టణ వాతావరణంలోని ప్రేక్షకాభిరుచులకు, గ్రామ వాతావరణంలోని ప్రేక్షకాభిరుచులకు ఎంతో తేడాఉంటుంది. నాటక ప్రదర్శనలు చూసే ప్రేక్షకులను "మీరు నాటక మెందుకు చూస్తారు" అనే ప్రశ్నవేసి జవాబు సేకరించుకొంటూ పోతే దాదాపు ఎంతమందిని అడుగుతామో అన్ని విభిన్నమైన జవాబులు స్థూలంగావస్తే మనము ఆశ్చర్య పడనక్క