పుట:RangastalaSastramu.djvu/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దర్శకుడు : నటీనటులు

దర్శకుని బాధ్యతలు

దర్శకుడు నాటకప్రయోగంలో తనకు సంబందమున్న మూడు ముఖ్య విభాగాల వ్యక్తులకు న్యాయము చేకూర్చవలె. వీరెరంటే - 1. రచయిత, 2. నటీనటులు, 3. ప్రేక్షకులు.

ఈమూడువర్గాల కృషినీ ఆసక్తినీ తాను సమన్యయపరచి, నాటక రసస్థితికి సృజనాత్మక కళాకారుడుగానూ (creative artist), ప్రధానవ్యాఖ్యాత (Chief interpreter) గానూ వ్యవహరించి దర్శకుడు రాణించవలసి ఉన్నది.

1.దర్శకుడు: రచయిత

నాటకంలోని భావాలను, ఉద్దేశాలను సక్రమంగా, సమగ్రంగా, నిర్దుష్టంగా, నిర్ధిష్టంగా తెలుసుకొని రచయితకు ప్రతినిధిగా దర్శకుడు వ్యవహరించవలె. నాటకంలో రచయిత తెలపని సూచనలు, పాత్రల స్వభావ స్వరూపాలు ఊహించి, నటీనటులకు వివరించి బోధించి వారిచేత ఆ యా భావాలను కళాత్మకంగాను, శక్తిమంతంగాను, ఆకర్షణీయంగాను దర్శకుడు ప్రదర్శింపచేయవలె.

2. దర్శకుడు: నటీనటులు

నటీనటుల ప్రతినిధియైన దర్శకుడు వారి8 కన్నులు చెవులుగా వ్యవహరించవలె. నటులు రంగస్థలంమీద ఉండడంవల్ల వారు ప్రేక్షకులకు ఎట్లా కనిపిస్తారో, వినిపిస్తారో తెలుసుకోలేరు కనుక వారికిబదులుగా దర్శకుడు ఊహించి, వివరించి సాయపడవలె. తన పరిశీలన ఆధారంగా వారికి ప్రోత్సాహము కల్గించి, సలహాలు, సూచనలు ఈయవలె. ఏవిధంగా శరీరభంగిమలు రూపొందించుకోవలెనో,