Jump to content

పుట:RangastalaSastramu.djvu/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వకాలంలో (rehearshals) నటీనటులు యాంత్రికమైన అభ్యాసంలో నిమగ్నులై ఉంటారు కనుక అప్పుడు నాటకంయొక్క అర్ధంమీద గానీ, అంతరార్ధంమీదగానీ ఇతరాంశాలమీద గానీ తమ మనస్సులు లగ్నము చేసే స్థితిలో ఉండడంఅరుదు. అభినయ ప్రక్రియలు (actions) నటీనటుల ఏకాగ్రత లేనిదే చక్కగా రూపొందించడం సాద్యంకాదు. అందుచేత ఈ ఏకాగ్రతకు భంగము కలుగకుండా, ఆ విషయాలమీద శ్రద్ధ చూపి ప్రదర్శన సగిగా రూపొందేటందుకు, ఒక ప్రత్యేక కళాకారుడు అవసరమౌతాౠ. రచయితయొక్క కళాత్మక కృషి నాటక ప్రదర్శనంలో నటీనటులద్వారా వెల్లడి అవుతుంది. దేనిని ఎట్లా అందజేయవలెనో నిర్ణయించేది దర్శకుడే.

నటుడు తన అభినయ పహలితాన్ని (ప్రేక్షక దృష్టిలో) - ఎట్;ఆ సరిగా నిర్ణయించుకోలెడో, అట్లాగే, తక్కిన నటుల అభినయాలలో, తన అభినయము తెచ్చే పరిణామాలు ఎట్లాంటివో, ఒక దృశ్యంలొని తన అభినయము ఆ కిందటి దృశ్యంలో తన అభినయంపై ఎట్లాంటి ప్రభావాన్ని చూపుతుందో; మొత్తంమీద నాటక ప్రదర్శనలో అది ఏ ఫలితాన్ని సాధించగలదో - ఊహించుకోవడం కష్టతరమే, తన పాత్రయొక్క స్వభావ స్వరూపాలను గురించి నటుడు ఒక నిశ్చితాభిప్రాయము కలిగి ఉన్నప్పటికీ ఈ అభిప్రాయము నాటక సమగ్ర స్వరూపంలో ఎట్లా సమర్ధనీయమో, వివిధ పాత్రలను, వాటి స్వభావ స్వరూపాలను ఎట్లా సమన్యయపరచుకొవలెనో నాటక సమగ్రస్వరూపాన్ని ఎట్లా ఊహించుకోవలెనో అవగాహన కావడంకూడ కష్టము కనుక ఈ బాధ్యతలు నిర్వర్తించడమే దర్శకునియొక్క ధ్యేయము. నాటకప్రయోగం (Play Production) లో ఒక ముఖ్యాంగంగా, నాటక సామరస్యసాధనకూ, సమిష్టి కృషికీ, రచనలోని భావోద్దేశాల సక్రమ ప్రకటనకూ "దర్శకుడు" అనే ఒకస్ ప్రత్యేక కళాకారుడు అవసరమని గుర్తించడం జరిగింది. పూర్వపు రోజులలో చాలావరకు ఆ యా నాటకాలలోని ముఖ్యపాత్రధారులే ఈ బాధ్యత వహించేవారు. నాటకంలోని పాత్రలు ధరించే దుస్తులు మొదలు ప్రదర్శన పరికరాలు, ఆహార్యము, హావభావ ప్రకటన పద్ధతులవరకు దర్శకుడే ఒక పరత్యేక కళాకారుడై - బాధ్యత వహించే నూత్న పరిణామము ఇప్పుడిపొపుడే మనదేశంలో ప్రచారానికి వస్తున్నది.