చైతన్యము మూలంగా వెలువడినవే. ఈ నాటకాలలో ఇంకొ విశేషము స్త్రీ సమస్య ప్రధానము కావడం. స్త్రీకి ఆర్ధిక స్వాతంత్ర్యమున్నపుడు సాంఘికంగా కూడ ఆమెకు స్వాతంత్ర్యము లభిస్తుందనె సిద్ధాంతము వీటిలో కానవస్తుంది.
దేశంలో జాతీయోద్యమము ప్రజ్వరిల్లడంతో రైతు సమస్య, హరిజన సమస్య ప్ర్రాముఖ్యానికి వచ్చినవి. రైతు జాతికి వెన్నెముక అనే భావము ప్రబలింది. దీని ప్రభావంవల్ల ప్రప్రధమంగా రైతు జీవితంలోని ఆశలను, ఆలోచనలను, చిత్రిస్తూ వెలువడిన నాటకము సబ్నవీసు రామారావుగారి "రైతు బిడ్డ" (1930). ఈ నాటకంలో వారు వాడినభాష జీవభాష, గ్రామీణభాష. వృత్తికి సంబందించిన పదాలు, మాండలీకాలు ఇందులో కోకొల్లలు. సామాన్య మానవునికి నాయకపట్టము గట్టి నాటకము వ్రాయడానికి వీరే ప్రధములేమో ఏమైనా ఈ నాటకము రచయితలమీద అడలేని ప్రభావాన్ని వెరఫింది. ఆ తరవాత 'పిల్ల రైతుబిడ్డలు ' అనేకము వెలువడినవి.
గాంధీజీ హరిజనోద్యమప్రభావంవల్ల దేశంలొ సాంఘిక-అన్యాయాలు, ఆర్దిక-అసమానతలు తొలగించి న్యాయము చేకూర్చడానికి హరిజునుడే నాయకుడుగా 'స్పృశ్య విజయం ', 'నదనార్ ','పతీత పావన ' వంటి నాటకాలు వెలువడసాగినవి. సంఘంలో అట్టడుగున పడిఉన్న మానవునికి ఈ విధంగా నాటక నాయకత్వము లభించింది.
ఈకాలంలో ప్రవర్ధమానమైన ఇంకొక ప్రక్రియ పద్యనాటకము, గేయనాటకము. వావిలాలవారి నందకరాజ్యము ', కందుకూరివారి 'వెనిస్ వర్తక చరిత్ర,' రెంటాల సుబ్బారావుగారి 'అధిలబింబము ' పద్యనాటకాలే; కాని అవి ప్రచారంలోకి రాలేదు. ఈ రకం నాటకాలను పునరుద్ధరించినవారు శ్రీ శివశంకర స్వామి. వారు 'పద్మావతీచరణ ఛారణ చక్రవర్తి,' దీక్షితదుహిత ' మొదలైన పద్య, గేయ నాటకాలు రచించి యువరచయితలకు మార్గదర్శకులైనారు. పధ్యనాటకాలలో నాటకీయత ముందుకు దూకుతూ ఉంటుంది. నేపధ్యగానం పాత్రల మనోభావాలను, అంతరసంఘర్షణను చూపే విధానానికి తెలుగు శివశంకరులే ప్రారంభకులు.
తెలుగుదేశంలో స్దరికొత్తభావాలు 1940 నాటికి నెలకొని సంఘంలోని అసమానత నశించి సామ్యవాద-ఆర్ధిక విధానము అమలులో;