పుట:RangastalaSastramu.djvu/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎక్కువగా కనిపిస్తుందెగాని, బాహ్యరూపంలో తిరుగుబాటు ఎక్కువగా కనిపించదు, వీరి నాటకాలలో సైతం పద్యాలు, స్వగతాది పూర్వనాటక లక్షణాలు గోచరిస్తాయి.

పురాణగాధలకు, పాత్రధర్మానికి కొత్త వ్యాఖ్యానముచేస్తూ, ఆ వ్యఖ్యానానికి అనుగుణంగా పాత్రలను చిత్రించిన వారిలో అగ్రేసరుడు గుడిపాటి వెంకటచలంల్. వీరి సావిత్రి, చిత్రాంగి మొదలైన నాటకాలు దేశంలో సంచలనము కలిగించినది. వీరు వ్యావహారిక వచనంలో, మంచి పదునైన శైలిలో, నాటకాలు రచించి ఒకకొత్త ప్రపంచాన్ని సాక్షాత్కరింపచేసినారు.

1920 నాటికే గ్తెలుగునాటకరంగ క్షీణదశ ప్రారంభమైంది. నాటకాలు సంగీతమయమైపోయినవి. అబినయము మొదలైన ప్రధాన నాటక ప్రయోగాంగాలను తోసి రాజని సంగీరము రాజ్యమేలసాగింది. అటువంటి నాటకాలను, నాటక ప్రయోగాలను అవహేళనచేస్తూ నాటకాలు, నాటికలు వెలువడసాగినవి. ఈ ప్రక్రియకు ఆధ్యుడు కె. చన రఘుపతిరావుగారు; వీరి 'నాటక కోలాహలము ' అనే ప్రహసనము తెలుగు నాటకరంగాన్ని పరిహసించే ప్రప్ర;ధమ ప్రహసనము. ఆ తరవాత బి.టి. రాఘవాచార్యులుగారి 'రంగసభ ', మల్లాదిల్ అవధానిగారి 'అసంపూర్ణ రామాయణం' మొదలైన ప్రహసనాలు వెలువది నటలోకమ్లో సంచలనము కలిగించినవి.

1930 నాటికి జాతీయ అంతర్జాతీయ నాటకసాహిత్య మెక్కువగా మనకు ఇంగ్లీషుద్వారా అందుబాటులోనికి వచ్చింది. ఇబ్సెన్, షా, చెకోవ్, టాల్ స్టాయ్ ప్రభృతుల నాటకాల ప్రభావము తెలుగు రచయితలమీద ఎంతగానో పడిండి. ఆ ప్రభావ ఫలితంగా వెలువడిందే పి.వి.రాజమన్నారు గారి "తప్పెవరిది" అనే సాంఘికల్ నాటకము. ఇది పూర్తిగా వచననాటకము. ముసలిప్లీడరు పడుచు యువతిని వివాహము చేసుకోవడం, పడుచు కుమారుని అనుమానించడం, చివరకు భార్య తిరగబడడం ఇందులోని ఇతివృత్తము. దీనిని బళ్ళారి రాఘవ విజయవంటంగా ప్రదర్శించడంతో తెలుగు నాటకచరిత్రలో తిరిగి వచన నాటక యుగము ప్రారంభమైంది. 'తప్పెవరిది ' విజయవంతము కావడంతో వచన నాటకాలు రక్తికట్టవనే భావము సమసిపోయింది. నాటినుంచి వచననాటకాలు తామరతంపరగా వెలువడసాగినవి. రంగారాం గారి 'దంపతులు ' , బళ్లారి రాఘవ గారి 'సరిపడని సంగతులు ', మల్లాది అవధానిగారి 'గాలివాన ' ఈ నూతన