పుట:RangastalaSastramu.djvu/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్య ప్రమాణాలు ఎక్కువగా భాసిస్తూ ఉంటాయి. విశ్వనాధవారి నాటక సాహిత్యాన్ని ఈ కోవలో చేర్చవచ్చు. వారి నర్తనశాల, అనార్కలీ నాటకాలలోని భావుకత, మధురకవిత అనన్య సాధ్యముల్. వీరి నర్తనశాల పౌరాణిక నాటకాలకు శిరోభూషణము కాగా వీరి అనార్కలి చారిత్రక నాటకరచనకు పరాకాష్ట. లక్షణగ్రంధాలలో చెప్పిన ఉద్దీపన విభవాలైన వసంతుడు, పూలకన్నెలు, మన్మధుడు. చిలకలు ఈ నాటకంలో పాత్రలు. భారతీయ నాటకసాహిత్యంలో ఇది అపూర్వరచనా విధానము. చింతా దీక్షితులుగారు పక్షులనుగూడ పాత్రలుచేసి శబరి నాటకము రచించినారు. అబ్బూరి రామకృష్ణారావుగారి నదీసుందరికూడ ఇట్టి సాంకేతిక నాటకమే!

సంఘంలోని కుళ్లు కడిగివేయవలెననే సంకల్పంతో వీరేశలింగంగారు తను ఉద్యమానికి ప్రహసనాలను కూడ ఆయుధంగా చేసుకొన్నారు. అయితే వారి దృష్టి ప్రధానంగా సంఘ సంస్కరణేగాని సాహిత్యసృష్టి కాకపోవడంవల్ల వీటిలో వాదోపవాదాలు, చర్చలు, ఉదాహరణలు అధికమై నాటకీయత కొంతవరకు దెబ్బ రిన్నదనే చెప్పవలె. ఇవి పూర్తి వచనంతో వాడుకభాషకు దగ్గరగా ఉండే శైలిలో సర్వులకు అర్ధమయ్యేటట్లు ఉంటాయి. కన్యాశుల్కము తరవాత ఈకాలంలోవచ్చిన సాంఘికనాటకాలలో ముఖ్యమైనవి కాళ్లకూరి నారాయణరావుగారి చింతామణి, వరవిక్రయము, మధుసేవ. ఆనాడు సంఘాన్ని పట్టి పీడిస్తున్న వ్యభిచారము, వరసుల్కము, మధుపానము వరుసగా ఈ మూడు నాటకాలకు ఇరివృత్తాలైనవి. ఈ మూడు నాటకాల ప్రేక్షకుల ఆదరాన్ని ఎంతగానో పొందినవి. సమస్యా పరిష్కారానికి దేవుళ్ళను, దేవతలను ఏదోవిధంగా కిందికి దింపే పద్ధతి నాటి సాంఘికనాటకాలలో సైతం వదలలెదు. వీటిలో పద్యాలుకూడ ఎక్కువే. ఈ మూడు నాటకాల నాయకులు ధనికవర్గానికి చెందినవారే వీటిలో పద్యాలు ప్రసన్నగుణంతో అలరారుతూ ప్రేక్షకులను రంజింపచేసేవి.

నాటి విద్యావంతుల ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతి ప్రభావితులభావాలలో ఈ కాలంలో పెద్ద మార్పు వచ్చింది. గుడ్డిగా నమ్మకుండా, ప్రతిదానిని ప్రశ్నించే మనస్తత్వం ఏర్పడించి. వారి దృష్టిలో ముదుగాపడినవి రామాయణ బారతాలు, పురాణాలు. ఈ ప్రశ్నదృష్టితో ప్రప్రధమంగా పురాణాలను నిశితంగా పరిశీలించడానికి పూనుకొన్నవారు త్రిపురనేని రామస్వామి చౌదరి. వారి కురుక్షేత్ర సంగ్రామము, శంబూకవధ, ఖూనీ విమర్శనాటకాలు. నాటకభావంలో తిరుగుబాటు