పుట:RangastalaSastramu.djvu/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సంచకబ ప్రభావంగా తెలుగులో కొత్తతరహా నాటకాలు అవతరించాయి. వాటిని రెందురకాలుగా విభజించవచ్చు. 1. చరిత్రాత్మక నాటకాలు, 2.భావప్రధాన నాటకాలు. ఈరాజకీయ సంచలనం మూలంగా, దేశభక్తి ప్రబోధము లక్ష్యంగా వెలువడినవి చారిత్రక నాటకాలు. సాహిత్యరంగంలో సంచలనం మూలంగా బావకవిత్వ ప్రభావంవల్ల మొలకెత్తిన సాహిత్యనాటకాలు భావప్రధాన నాటకాలు.

ఈ చారిత్రిక నాటకాలు రెందురకాలు -- పూర్వచరిత్ర చిత్రణద్వారా దేశభక్తిని ప్రబోదించే నాత్కాలు ఓకరకము; సమకాలీన రాజకీయాలను చిత్రించడం ద్వారా దేశభక్తిని ప్రబోధించే నాటకాలు రెండోరకము. మొదటిరకం చారిత్రిక నాటకాలకు రసపుత్ర విజయము, రొషనారా మచ్చుతునకలు, రసపుత్రుల దేశభక్తిని, శౌర్య పరాక్రమాలను చిత్రించే వీరరసనాటకము రసపుత్ర విజయము. రోషనార మహరాష్ట్రవీరుల శౌర్యపరాక్రమాలను, దేశభక్తిని చిత్రించే నాటకము, హిందూముస్లిం ఐకమత్యానికి భంగం కలిగిస్తుందనే నెపంతో ఆనాటి బ్రిటిషు ప్రభుత్వం రోషనారనాటకాన్ని నిషేదించింది. ఈ చారిత్రక నాటకాలలో దేశ భక్తిని ప్రభోదించడానికి తోడు అంతర్వాహినిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం కూడా గోచరిస్తుంది

దేశరాజకీయ జీవితంలో ఆనాడు ప్రముఖ పాత్ర వహిస్తున్నగాంధీజీ, ఆలీసోదరులు, చిత్తరంజనదాస్ మొదలైన రాజకీయ నాయకులనే పాత్రలుగా జేసి ఆనాటి రాజకీయాలను చిత్రించే నాటకాలు రెండోరకం నాటకాలు. వీటికి ఆద్యులు రామరాజు పుండరీకాక్షుడు, ఆంధ్రదేశంలోనేకాదు, మొత్తము భారతదేశంలోనే ఇట్లాంటి సమకాలీన రాజకీయ నాటకాలు రచించడానికి వీరుఆధ్యులు. వీరి గాందీ విజయము, పాంచాలీ పరాభవము దేశంలో దేశభక్తిని రేకెత్తించినవి. వీటినికూడ నాటి బ్రిటిషు ప్రభుత్వము నిషేదించింది. ఈ నాటకాల ప్రభావంవల్లనే శ్రీప్;ఆదకామేశ్వరరావు, పింగళి నాగేంద్రరావు, జంధ్యాల శివన్నశాస్త్రి ప్రభృతులు బెంగాలీ, మహారాష్ట్ర నాటకాలను, ముఖ్యంగా ద్విజేంద్రలాల్ రాయి నాటకాలను అనుససరించి తెలుగు నాటకసాహిత్యాన్ని పరిపుష్టంచేసినారు.

రాజకీయ సంచలనంతోబాటే సాహిత్యరంగంలోనూ సంచలనము వచ్చింది. ప్రబంధ, చిత్రకవితా ప్రక్రియలనుతోసిరాజని కొంగ్రొత్త ప్రక్రియలను ఆనాటి భావకులు చేపట్టినారు. వీరి నాటకాలలో, నాటికలలో రాజకీయతకంటె