పుట:RangastalaSastramu.djvu/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎక్కువ, పౌరాణిక, సాంఘిక - ఇతివృత్తాలతో గద్య పద్య నాటకాలు రచించి తెలుగు నాటక సాహిత్యానికి పుష్టి చేకూర్చినారు. సంభాషణారచనలో అందెవేసినచేయి. నాటకంలోతేటగీతి, ఆటవెలది వంటిమాత్రా చందస్సులేగాని, గణబద్ధమైన చందస్సు వాడకూడదనే వాదన లెవనెత్తి తన నాటకాలలో పద్యాలను మాత్రా చందస్సుతోనే రంచించినారు. వారి 'కంఠాభరణము '. రాధాకృష్ణ ' తెలుగు నాటకసాహిత్యానికి మణిపూసలు.

చిన్న చిన్న మాటలతో, ప్రసన్నశిలితో నాటకాలు రచించి అశేష ప్రజానీకాన్ని రంజింపజేసినవారు చిలకమర్తివరు, తిరుపతి వేంకటకవులు, చిలకమర్తివారి "గయోపాఖ్యానము", తిరుపతి వేంకటకవుల "పాండవోద్యోగ విజయాలు" వేలకొలదిసార్లు ప్రదర్శితాలై లక్షలప్రతులు అమ్ముడు పోయినవి. ఈనాటకాలలో పద్యాలు కుప్పలుతిప్పలు, సంగీతనాటకాలుగా ఇవి తెలుగునాటక సాహిత్యంలోను ప్రజా హృదయాలలోను సుస్థిరస్థానము సంపాదించుకొన్నాయి.

ఈ కాలంలో బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి కాళ్లకూరి నారాయణరావు, కాళ్లకూరి సామబశివరావు, మారేపల్లి రామచంద్ర, కె.సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రభృతులెందరో పౌరాణిక, చారిత్రక సాంఘిక నాటకం రచించి తెలుగు నాటకరంగానికి బలము చేకూర్చినారు. ఈ స్వతంత్ర నాటకాల సరసనే సంస్కృతాంగ్ల నాటకానువాదాలుకూడ వెలువడినాయి. కందుకూరివారి "శాకుంతలము", వడ్డాదివారి 'వేణీసంహారము" సంస్కృతానువాద నాటకాలలో ఎక్కువ ఆదరణ పొందాయి. ఇట్లాఒక్కొక్క రచయిత ఒక్కొక్క విషయంలో విశిష్టతను ప్రదర్శించసాగినారు.

ఒకవైఉన వందలకొలది పద్యాలతో, పాటలతో, దైవలీలలతో నాటకాలు వస్తూఉంటే, ఇంకోవైపున అంత ఎక్కువగా కాకపోయినా, వచన నాటకాలు, వాస్తవికతను పొదువుకొన్నవి వెలువడుతూనె ఉన్నాయి.

మొదటి ప్రపంచ యుద్ధము మిగిసింది. భారతదేశానికి స్వాతంత్ర్యము లభిస్తుందనె ఆశ అడియాస అయింది. పైగా రౌలట్ శాసనము, పంజాబు దురంతాలు, భరతీయులలో పెద్దసంచలనము కలిగించాయి. ఈరాజకీయ సంచలనంతోపాటే సాంఘిక, సాహిత్యరంగాలలో కూడ పెద్దసంచలనము వచ్చింది. పాశ్చాత్య ప్రభావమెక్కువగా పడింది.