పుట:RangastalaSastramu.djvu/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

తెలుగు నాటక సంక్షిప్త చరిత్ర

ఈ రూపకంలో వర్ణితమయింది. నాటకీయత ఎక్కువ లేకపోయినా ఆ కాలం లోని తెలుగువారి ఆచారాలు వినోదాలు, మతము, కళారూపాలు ప్రస్పుటంగా ఇందులో ప్రతిఫలిస్తున్నాయి. ఇది తెలుగువారి సాంఘిక చరిత్ర రచనకెంతో ఉపకరిస్తుంది. క్రీడాభిరామంలో తెలుగు నాటకరచన ఒక సారి మెరుపులా తళుక్కుమని మాయమైంది; మళ్ళీ అంధకారము కప్పివేసింది.

పూర్వాంధ్ర ప్రజానీకానికి యక్షగానాలు, కలాపాలు, వీధినాటకాలు, తోలుబొమ్మలు, పగటివేషాలు మొదలైన జానపద కళారూపలే వినోదాన్ని, విజ్ఞానాన్ని కలిగిస్తూ ఉండేవి. ఈ రకం జానపదకళారూపాలు ఎక్కువ ప్రజాదరణ పొందడంవల్ల మార్గనాటకాలు రచించవలసిన అవసరంలేక పోయిందేమో. తెలుగుకవులు సంస్కృతనాటకాలను తెలుగులో శ్రవ్యప్రబంధాలుగా రూపొందించి తృప్తిపడుతూఉండెవారు. క్రీ. శ. 1860 వరకు తెలుగులో మార్గ నాటకరచన జరగలేదు.

"దృశ్య, శ్రవ్య కధామయంబులగు కావ్యంబుల శ్రవ్యమాత్రంబులు సవిసేష విశేషసుషమంబులై మహాకరులతో త్రిలింగభాషయందు గదితంబులుగా దృశ్యంబులగునవి తాదృశంబులు గామికిం జింతించి" కీ|| శే|| కోరాడ రామచంద్రశాస్త్రిగారు 1860 లో మంజరీమధుకరీయమనే స్వతంత్ర రూపకము రచించి ఆధునిక తెలుగు నాటక రచనాయుగానికి నాందిపాడినారు. ఇప్పటివరకు తెలిసినదానినిబట్టి మంజరీమధుకరీయమే ప్రధమనాటకమని విజ్ఞలు అభిప్రాయపడుతున్నారు. ఈ మంజరీమధుకరీయము సంస్కృత నాటకాలక్షణాలతో ఒప్పారుతున్నది. గ్రంధము చాలాపెద్దది. అంతగా ప్రదర్శనయోగ్యమైనది కాదు. దీర్ఘ సమాసభూయిష్టమైనది. ఇది 1903 లోగాని అచ్చుకాలేదు.

స్వతంత్రనాటక రచనలేగాక, సంస్కృత రూపకాలను అనువదించడానికికూడా శ్రీకారముచుట్టినది రామచంద్రకవిగారే ! వీరి వేణీసంహారానువాదమే ప్రప్రధమ సంస్కృతానువాదము. వేణీసంహారమేగాక ఉత్తరరామచరిత, ఉన్మత్తరాఘవము, శాకుంతలము కూడ ఆయనచే అనూదితాలైవవి. అయితే వీధి నాటకాలకన్న ముందుగా ప్రచురితమైనది కొక్కొండ వేంకటరత్నంగారి నరకాసుత విజయవ్యాయోగము (1892). పంతులుగారు ఈ అనువాదంలో సంస్కృత వచనాన్ని తెలుగువచనంగాను, సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగాను అనువదించి అనువాద విధానానికి ఒరవడిపెట్టినారు. వీరు ఈనాటకాలనేగాక ధనంజయ