Jump to content

పుట:RangastalaSastramu.djvu/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

సంస్కృత రూపక సంక్షిప్త చరిత్ర

పరాకాష్టకువెళ్ళినా, నాటకరచనాశిల్పం దెబ్బతిన్నది. ఒకే నాయకునికి సంబందించిన రెండు గాధలను - ప్రణయగాధ, ఆత్మత్యాగగాధ - అతికినట్లు అనిపిస్తుంది. ప్రదర్శనంకూడ కొంతకష్టమే.

పూరరచనలను చక్కగా ఉపయోగించుకోవడంలో శ్రీహర్షుడు దిట్ట. కాళిదాసు నాటక త్రయంలోని రాయలు, సంఘటనలు హర్షునినాటకాలలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇంతేకాదు, ఇతరనాటకాలు మూడింటిలోనూ ఒకేరకమైన సంఘటనలు పునరావృత్తమవుతాయి.

మొత్తంమీద హర్షుని రూపకాలు సర్వాంగ సుందరాలు. సన్నివేశ కల్పనలో ఏమహాకవికీ తీసిపోనిదిట్ట శ్రీహర్షుడు.