పుట:RangastalaSastramu.djvu/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హర్షుడు

117

శకుంతల అత్తవారింటికి వెడుతూ ఉంటే పకృతికూడా శోకించి దివ్య వస్త్రాలంకారలు బహుకరించినట్లు చిత్రించడంవల్ల నాటకీయత ఇనుమడించడం ఇంధుకు తార్కాణము. అట్లాగే విక్రమోర్వశీయంలో పురూరవునికి ప్రకృతి అంతా ఊర్వశివలె కనిపించినదట!

శకుంతలను అత్తవారింటికి పంపే ఘట్టము, కణ్వుని పరితామము, కాళిదాసుని రచనల విస్వజనీనతకు ఉదాహరణలు. పాత్రచిత్రణలో కాళిదాసు మేటి. శకుంతల, మాళవిక, విదూషకుల పాత్రల చిత్రణ కాళిదాసు చిత్రణ నైపుణ్యానికి పరకాష్ఠగా తీసుకోవచ్చు.

కాళిదాసు, మహాశిల్పి, ఒక్కొక్కపదము, ఒక్కొక్క వాక్యము జాగ్రత్తగా 'చెక్కి 'నట్లు ఇతని రచనలు భాసిస్తాయి.

హర్షుడు

"శ్రీ హర్షో నిపుణ:కవి:" అని ప్రఖ్యాతిపొందిన సంస్కృత నాటక కర్త శ్రీహర్షుడు. ఇతని నాటకత్రయంలోని రత్నావళి సర్వలక్షణ లక్షితమై "రత్నావళీ రత్నము" అని ప్రశంసలందుకొన్నది.

హర్షుని నాటకాలు నాటకీయతకు ఆటపట్టులు. ఎంతో ప్రదర్శనానుకూలంగా ఉంటాయి. అద్భుత సన్నివేశకల్పన శ్రీహర్షుణిసొత్తు -- మారువెషాలతో ప్రియులను అబినందించడం, నాటకనాయకుడు అంతర్నాటకంలో నాయక పాత్ర ధరించడం, రాని దానిని కనిపట్టడం, ఉరిపోసుకోబోతున్న నాయికను నాయకుడు రక్షించడం మొదలైనవి ఎంతో నాటకీయతతో ఒప్పారుతూ ఉంటాయి.

ఇతని రత్నావళీ, ప్రియదర్శికా రూపకాలు నాటకనిర్మాణ నైపుణ్యానికి, సంస్కృత నాటికా లక్షణాల సంతరుంపుకు మేలుబంతులు.

హర్షుని నిర్వహణసంధి నిర్వహణ అద్బుతంగా ఉంటుంది. ఇది ప్రేక్షకులను అద్బుతరస పరవశులనుచేస్తుంది.

ఇతని కవిత్వము మనోరంజకమైనది. రూపకాలలో శృంగారరసము పొంగి పొరలుతూ ఉంటుంది. నిజానికి హర్షుని మూడు రూపకాలు రసగుళికలు.

ఇక నాగానందనాటకంలో ఇరివృత్తము మహోత్కృష్టమైనది; అపూర్వమైనది. ఆత్మత్యాగానికి ఈ నాటకము ప్రతీక. రసపాత్ర పోషణలో నాగానందము