శూద్రకుడు పాత్ర చిత్రణలో ఆరితేరినవాడు. వసంతసేన, శకారుదు, చారుదత్తుడు -- ఈ పాత్రలను తీర్చిదిద్దిన తీరు ఎంతగానో మెచ్చుకోతగ్గది.
అక్కడక్కడ నాటకీయతను దెబ్బకొట్టే దీర్ఘవర్ణనలున్నా, మృచ్చకటిక ప్రదర్శనయోగ్యతను సంతరించుకొన్న మహారూపకము; ఆనాటి రాజకీయ, సాంఘిక జీవనానికి దర్పణము.
కాళిదాసు
"కావ్యేసు నాటకం రమ్యం
నాటకేషు శకుంతలా"
అని ప్రసిద్ధికెక్కిన "అభిజ్ఞాన శాకుంతల" నాటక రచయిత కాళిదాసు, ఉపమాలంకార ప్రయోగంలో సిద్ధహస్తుడు కాబట్టి "ఉపమా కాశి దానస్య" అని నానుడి.
కాళిదాసు ప్రధమంగా మహాకవి. ఆ తరవాతనే నాటకకర్త. అందుచేతనే అతని నాటకాలలోనిశ్లొకాలలో కవిత్వము గుబాళిస్తూ మనోరంజకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. వాటిలోని ఉపమానాలు ఎక్కడినుంచో ఎరువు తెచ్చినవికాక నిత్యవ్యవహారంలో తారసిల్లేవే! అందుకే వాటికంత విలువ.
వాస్తవికతకన్న రసపోషణ, పాత్రపోషణ కాళిదాసుకు ప్రధానము దుష్యంతుని శీలరక్షణకు అలౌకికమైన దొర్వాసశాపము శాకుంతలంలోను, ఊర్వశి లేదీగగా మారడం విక్రమోర్వశీయంలోను చొప్పించడానికి కాళిదాసు వెనుదీయలేదు.
ఆయా వ్యక్తులను, ఆయా దృశ్యాలను కనులకు కట్టేటట్లు వర్ణించడంలో కాలిదాసు అసమానుడు. శాకుంతలంలొ దుష్యంతుని రధవేగ వర్ణన ఇందుకు తార్కాణము.
సన్నివేశకల్పనలో కాళిదాసుప్రతిభ వర్ణణాతీరమ్; ఆ కల్పనకూడ సహజమే అనిపిస్తుంది.
శృంగారరస నిర్వహణ, ఔచిత్యపోషణ, చతురసంభాషణారచన - ఇవి కాళిదాసు సొమ్ములు.
ప్రకృతికి మానవునికి గల సంబంధాన్ని, మానవుని చలనానికి ప్రకృతి ప్రతిచలనాన్ని చిత్రించడం కాళిదాసు శిల్పవిధానాలలో ఓకటి. శాకుంతలంలో