పుట:RangastalaSastramu.djvu/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శూద్రకుడు

(దూతవాక్యము). రంగాలకరణ (స్వప్నవాసదత్త) ప్రాధాన్యము వహిస్తాయి.

అచేతనాలకు చైతన్యము, రూపము ఆరోపించి పాత్రలుగా రూపకాలలో ప్రవేశపెట్టడానికి దారి చూపినదికూడ భాసుడే! బాలచరితలో, దూత వాక్యంలో విష్జ్ణుమూర్తి పంచాయుధాలను పాత్రలుగా ప్రవేశపెట్టడం ఇందుకు నిదర్శనము.

రసవత్తరంగా ఇన్నిరకాల రూపకాలను, ఇన్నిరకాల పాత్రలను సృష్టించిన మరోకవి సంస్కృత సాహిత్యంచరిత్రలో కనిపించడు.

శూద్రకుడు

రాజకీయ, సాంఘిక, ప్రణయగాధలను మిళితముచేసి, ఒకేఒక మహారూపకంగా రూపొందించిన ప్రప్రధమ సంస్కృతనాటకకర్త శూద్రకుడు. ఇతని ఏకైక రూపకము మృచ్చకటిక, ఉన్నతవంశాలు, న్యాయమూర్తులు, జూదరులు, రాజభటులు, దాసీలు, దొంగలు, రాజకీయ విప్లవకారులు, వేశ్యలు, సన్యాసులు మొదలైన రకరకాల పాత్రలు మృచ్చకటికలో మనకు తారసిల్లుతాయి; దొంగతనాల దగ్గరనుంచి రాజకీయ విప్లవంవరకు విభిన్న సంఘటనలు గోచరిస్తాయి.

ఉపకధలను ప్రవేశపెట్టి వాటిని ప్రధానకధతొ పెనవేసి అంతా ఒక్కటే కధ అని అనిపించేటట్టు చేయడంలో శూద్రకుడు కడు నేర్పరి. కధా విన్యాసంలో ఇతని ప్రతిభ గోచరిస్తుంది. కవిత్వము, వర్ణనలు పసందుగాఉన్నా, నాటకీయతను కొంచెము దెబ్బతీసేవిగా ఉన్నాయి. వసంతసేన చారుదత్తుని ఇంటికి వెళ్లేటప్పటి వర్ష వర్ణన మితిమీరి నాటకాన్ని త్వరగా ముందుకు సాగనీయదు.

వాస్రవికతను పునాదిగా చేసుకొన్నా, శూద్రకుడు యాదృచ్చికతకు తావీయక పోలేదు. రూపక ప్రారంబంలో శకారుడు రతుముకొనిరాగా వసంతసేనసరిగా చారుదత్తుని ఇంటికే చేరుకొంవడం; శర్విలకుడు దరిద్ర చారుదత్తుని ఇంట దొంగ్తనము చేయడం; చారుదత్త శకారుల శకటాలు తారుమారై వసంతసేన శకారుని బండిలో ఎక్కడం మొదలైన యాదృచ్చిక సంఘటనలు రూపకశిల్పం విలువను తగ్గిస్తున్నాయి.